NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీతో టీడీపీ – జ‌న‌సేన స్నేహం ఉందా.. ఉండీ లేదా… !

ఇంకేముంది.. కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతామ‌ని చెబుతున్న టీడీపీ-జ‌న‌సే నలు.. ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాయి. పైగా.. ఈ నెల 20-25 మ‌ధ్య‌లోనే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఢిల్లీ వెళ్లి చ‌ర్చ‌ల‌కు కూర్చుంటార‌ని.. నేరుగా ప్ర‌ధాని మోడీనే క‌లుస్తార‌ని కొన్ని రోజుల కింద‌ట వార్త‌లు పుంఖాను పుంఖాలుగా వ‌చ్చాయి. అయితే.. అనూహ్యంగా అనాలో.. లేక‌.. షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని అనుకోవాలో.. మొత్తంగా .. ఈ పొత్తులు ముందుకు సాగలేదు.

ప్ర‌స్తుతం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌తో ఫుల్లు బిజీగా ఉంటున్నారు. ఎక్క‌డా తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు.. అనేక అభివృద్ధికార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడు తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు-ప‌వ‌న్‌కు ఆయ‌న అప్పాయింట్‌మెంట్ ల‌భించ‌డం లేదు. మ‌రో వైపు.. బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా కూడా.. ఫుల్లు బిజీగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అప్పాయిం ట్మెంటు కూడా ద‌క్కే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు.

పోనీ.. వాస్త‌వానికి బీజేపీ క‌నుక పొత్తు కోసం ప్ర‌య‌త్నించి ఉంటే.. జేపీ న‌డ్డా లేక‌.. కేంద్ర మంత్రులు.. పార్టీ సీనియ‌ర్ల‌నైనా రంగంలోకి దింపి ఉండాల్సింది. కానీ, అలా కూడా జ‌ర‌గ‌లేదు. మ‌రోవైపు.. త‌న మానాన త‌ను అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించుకున్నారు చంద్ర‌బాబు.ఇది.. బీజేపీ సూచ‌న‌ల మేర‌కే ఆయ‌న అలా చేశార ని అనుకోవాలా? అనేది సందేహం. ఎందుకంటే.. 45 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నాయ‌కుడు.. ఇలా త‌న పార్టీ టికెట్ల‌ను వేరే పార్టీ సూచ‌న‌ల మేరకు పంపిణీ చేయ‌రు. సో.. ఎక్క‌డో పొత్తుల విష‌యం తేడా కొడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల అంత‌రార్థం కూడా ఇదేన‌ని తెలుస్తోంది. పొత్తుల‌ను విచ్ఛిన్నం చేసేందుకు సీఎం జ‌గ‌న్ ప్ర‌య త్నిస్తున్నార‌న్న‌ది ఆయ‌న ప్ర‌ధాన అభియోగం. అంటే.. దీనిని బ‌ట్టి.. కేంద్రంలోని బీజేపీ ద‌గ్గ‌రే పొత్తు విష‌యంలో జ‌గ‌న్ పుల్ల‌లు పెడుతున్నారా ? అందుకే బీజేపీ మౌనంగా ఉందా ? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు.. తెలంగాణ‌లో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఎన్నిక‌ల షెడ్యూల్‌కు ఒక వారం ముందు మాత్రమే రంగంలోకి దిగింది. ఇక్క‌డ కూడా అలానే వ్యూహం వేసిందా? అనేది కూడా ఆస‌క్తిగా మారింది.

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N