న్యూస్

బాబు ఇంటి ముందు టిడిపి నేత ధర్నా ! ఎందుకట?

Share

ఇప్పటికే టీడీపీ నేతలు చాలామంది చంద్రబాబు మోసం చేశాడని ఆరోపిస్తూ పార్టీలు మారారు. టీడీపీ సీనియర్ నేతగా సర్వస్వం అర్పించిన మోత్కుపల్లి నర్సింహులు అయితే బాబుపై చాలా ఆరోపణలు చేశారు. తనను వాడుకొని వదిలేశాడని విమర్శించాడు. ఇప్పుడు మరో నేత కూడా అలానే చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. 

 


ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు పై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.  తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ గా టీడీపీ తరుఫున పోటీచేసి ఓడిపోయిన వెంకటేశ్వరరావు అనే టీడీపీ నాయకుడు సోమవారం చంద్రబాబు ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. చంద్రబాబు తనను రాజకీయంగా 30 ఏళ్లుగా వాడుకొని వదిలేశాడని ఆరోపించారు.

టీడీపీ తరుఫున జూబ్లీహిల్స్ కార్పొరేటర్ పోటీచేసి ఓడిపోయానని.. తన సమస్యలను చెప్పుకోవడానికి కూడా చంద్రబాబు సమయం ఇవ్వడం లేదని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటి ముందు బైటాయించి ఆందోళన చేపట్టారు.ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది
బాబు యూజ్ అండ్ త్రో పాలసీ రాజకీయాలు అందరికీ తెలిసిందే .టిడిపిలో అది ఎప్పటి నుంచో జరుగుతోందని చాలా మంది నేతలు ఆరోపిస్తుంటారు.
అయితే తెలంగాణలో సోదిలో కూడా లేకుండా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు కటాక్ష వీక్షణాల కోసం ఒక నాయకుడు ఆరాట పడటం అనేది ఇక్కడ హైలెట్ .తెలంగాణలో ఉన్న టిడిపి నేతలైనా కాపాడుకోవాలని బాబుకు రాజకీయ పరిశీలకులు సలహా ఇస్తున్నారు.


Share

Related posts

Big Breaking: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..పది మందికి గాయాలు..!!

somaraju sharma

Jathi Ratnalu review : ‘జాతిరత్నాలు’ మూవీ రివ్యూ

siddhu

మరోమారు యూటర్న్ తీసుకున్న చంద్రబాబు..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar