NewsOrbit
న్యూస్

‘అర్హత లేకుంటే ప్రాజెక్టుకే ప్రమాదం’

అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మెగా కృష్ణారెడ్డి కంపెనీకి జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కెఇ కృష్ణమూర్తి ఆరోపించారు.  దేశంలోనే మొట్టమొదటి సారిగా రివర్స్ టెండరింగ్ రాష్ట్రంలో సక్సెస్ అయ్యిందనీ, ప్రభుత్వ ఖజానాకు 58కోట్ల రూపాయలు ఆదా అయ్యిందనీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంపై కెఇ మాట్లాడుతూ అర్హత లేని కంపెనీకి ప్రాజెక్టుని అప్పగించడం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడమే అవుతుందని విమర్శించారు. తమ వర్గానికి చెందిన మెగా క్రిష్ణారెడ్డి కంపెనీకి భారీ ప్రాజెక్టులు నిర్మించే అర్హత లేకున్నా, ప్రాజెక్టును అప్పగించేందుకు జగన్మోహన్ రెడ్డి నిబంధనలు సడలించారని కెఇ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ తో  ప్రాజెక్టు భద్రతకు పెను ముంపు ఉంటుందని ఆయన హెచ్చరించారు.

రివర్స్ టెండరింగ్ చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ భద్రతకు పాత కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తారా లేక కొత్త కాంట్రాక్టర్ వహిస్తారో  ప్రజలకు చెప్పాలని కెఇ డిమాండ్ చేశారు. నాసిరకంగా పనులు చేస్తే ప్రాజెక్టుకు పెనుప్రమాదం పొంచి ఉంటుందని అన్నారు. ఎదైనా జరగరానిది జరిగితే ఉభయ గోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయిని కెఇ ఆందోళన వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడేళ్లు ఆలస్యమవుతుందని కెఇ చెప్పారు. పాత కాంట్రాక్టర్ ను కొనసాగించి వుంటే 2020 నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందించే వెసులుబాటు వుండేదని కెఇ అన్నారు.

నవయుగను తొలగించి మెగా క్రిష్ణారెడ్డి కంపెనీకి కట్టబెట్టడం వల్ల కనీసం మూడేళ్లు ప్రాజెక్టు ఆలస్యమవుతుందని కెఇ పేర్కొన్నారు.పోలవరంలో కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు మెగా క్రిష్ణారెడ్డికి రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్రికల్ బస్సుల కాంట్రాక్ట్ అప్పగించడానికి రంగం సిద్దమైందని కెఇ ఆరోపించారు. అదే విధంగా 30 వేల కోట్ల రూపాయల విలువ చేసే వాటర్ గ్రిడ్ పనులు కూడా మెగా క్రిష్ణారెడ్డికి అప్పగించేందుకు పథక రచన చేశారని కెఇ విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కెఇ హితవు పలికారు.

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్న విధంగా మ్యాక్స్ ఇన్ఫ్రా అనే  అసమర్ధ కంపెనీకి పోలవరం పనులు అప్పగించారని గతంలో సాక్షి పత్రికలో కథనాలు రాసిన విషయాన్ని కెఇ గుర్తు చేశారు. గతంలో ఇదే కంపెనీపై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి నేడు అదే కంపెనీకి ప్రాజెక్టు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటో బయట పెట్టాలని కెఇ డిమాండ్ చేశారు.

ఐదేళ్లలో 63 శాతం పనులు పూర్తి చేసిన కంపెనీని పక్కన పెట్టి,10 ఏళ్లలో ఎడు శాతం పనులు పూర్తి చేసిన కంపెనీకి అప్పగించడం ద్వారా  పోలవరం ప్రాజెక్టును మరో ధన యజ్ణం చేయదలిచారా అని కెఇ ప్రశ్నించారు. డ్యామ్ పనులు. పవర్ ప్రాజెక్టు పనులు వేర్వేరుగా టెండర్లు పిలవకుండా ఒకే టెండర్‌లో పిలవడంలో ఉద్దేశం ఎమిటని కెఇ ప్రశ్నించారు. రోడ్లు వేసే ఇంజనీర్లకు డ్యామ్‌ల నిర్మాణం గురించి తెలిసే అవకాశం ఉంటుందా అని కెఇ ప్రశ్నించారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Leave a Comment