NewsOrbit
న్యూస్

ఫుల్ డీటైల్స్: వైకాపా “ల్యాండ్ స్కామ్” ని పట్టుకున్నాం అంటున్న టీడీపీ!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… జగన్ పార్టీకీ, పాలనకూ కలిపి ఒకేసారి ఇబ్బందిని కలిగించే అవకాశం టీడీపీకి దొరికింది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పథకం అందుకు కారణం అయ్యింది! జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం ద్వారా సుమారు 30లక్షల మంది అర్హులకు లబ్ధిచేకూరనుంది! అది వైకాపా కు మామూలు ప్లస్ కాదు అని అంతా భావించారు కానీ.. ఇప్పుడు అదే పెద్ద సమస్య అయ్యి కూర్చుంది.

వివరాళ్లోకి వెళ్తే… పేదలకు ఇళ్లస్థలాలు పంచే కార్యక్రమంలో భాగంగా భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు రెగ్యులర్ గా వస్తున్నాయి. వీటిని కేవలం ప్రతిపక్షాల విమర్శలుగా మాత్రమే చూడలేని పరిస్థితి ఏపీలో నెలకొంది! ఏ నియోజకవర్గాన్ని కదిలించినా అర్హులకు అందేవిషయంలోనూ.. స్థలాలను కొనే విషయంలోనూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కార్యక్రమాలు అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఎన్నో చేశారని చెబుతున్నారు! ఇందులో భాగంగా వెలుగుచూసిన ఒక వ్యవహారం ప్రతిపక్షాలకు చాలా బలాన్ని ఇవ్వబోతుందనే అంటున్నారు!

గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట, ముత్తాయపాలెం గ్రామాల్లో బ్యాంక్ తాకట్టులో ఉన్న భూమికి సంబందించి నకిలీ పేపర్లు సృష్టించి.. ప్రభుత్వ భూసేకరణకు అంటగట్టే కార్యక్రమం ఒకటి వెలుగులోకి వచ్చింది. అవును… గుంటూరు జిల్లాలోని సెంట్రల్‌ బ్యాంక్‌ లో ఇప్పటికే సుమారు రూ. కోటీ ఇరవై లక్షల రూపాయల అప్పు తీసుకుని, ఆ పత్రాలు బ్యాంకులోనే ఉన్నప్పటికీ.. వాటికి దొంగ పత్రాలు సృష్టించి.. భూసేకరణకు అప్పగించేపనికి పూనుకున్నారట స్థానిక వైకాపా నాయకులు! దీంతో వ్యవహారం చినికి చినికి సీబీఐ వరకూ వెళ్లింది!!

పైగా ఈ భూమి 8 నుంచి 9 ఎకరాలు ఉండటంతో… ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం 15 – 20 లక్షలకు బదులు ఏకంగా 50 – 60 లక్షలు విలువ కట్టి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టేపనికి పూనుకున్నరంట! దీంతో వ్యవహారం బ్యాంక్ అధికారులకు తెలియడం.. పోలీసులుకౌ ఫిర్యాదు చేయడం.. అధికారపార్టీ నాయకులు ఉండటంతో వారు కాస్త వెనక్కి తగ్గడం.. ప్రతిగా బ్యాంక్ అధికారులు సీబీఐ ని సంప్రదించడం… హుటాహుటిన జరిగిపోయాయి!! దీంతో… వైకాపా ల్యాండ్ స్కాం బయటపడిందంటూ టీడీపీ నేతలు మైకులముందుకు వచ్చేశారు!!

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju