NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురంలో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం .. టీడీపీ జండాలు, ఫ్లెక్సీలు ధగ్ధం

TDP: పొత్తులో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించింది టీడీపీ. ఈ క్రమంలో పిఠాపురం నుండి తానే పోటీ చేస్తున్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో టీడీపీ నుండి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండా ఏకపక్షంగా పిఠాపురంను జనసేనకు కేటాయించడంపై తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. వర్మకే టికెట్ ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు మంటల్లో వేసి దగ్ధం చేశారు.

మరో పక్క పెనమలూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు టికెట్ లేదని అధిష్టానం నుండి సమాచారం అందడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించారు. పెనమలూరుకు వచ్చే టీడీపీ అభ్యర్ధికి రేపటి నుండి చుక్కలు చూపిస్తామని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

ఇటు పిఠాపురంలో, అటు పెనమలూరులో తీవ్ర స్థాయిలో తెలుగు తమ్ముళ్ల నుండి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం పెద్దలు అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తొంది. పెనమలూరు నుండి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన బొడె ప్రసాద్ .. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కొలుసు పార్ధసారధి చేతిలో పరాజయం పాలైయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలను బొడె ప్రసాద్ నిర్వహిస్తూ వచ్చారు.

Pawan Kalyan: పోటీ చేసే స్థానాన్ని వెల్లడించిన పవన్ కళ్యాణ్ .. జనసేనాని అనూహ్య నిర్ణయం ..ఎందుకంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju