Subscribe for notification

TDP Mahanadu: మహానాడు వేదికగా తన ఘనతను మరో సారి చెప్పుకున్న చంద్రబాబు

Share

TDP Mahanadu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సైబరాబాద్ అభివృద్ధి, హైటెక్ సిటీ ల గురించి తరచు చెప్పుకుంటూనే ఉంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికపై నుండి ఏపిలో జగన్ సర్కార్ పాలనను తీవ్ర స్థాయిలో విమర్శించిన చంద్రబాబు మరో సారి హైదరాబాద్ లో అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఇదే సందర్భంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) 20 వ వార్షికోత్సవ వేడుకల గురించి మాట్లాడారు. అక్కడి వార్షికోత్స వ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని ఎన్ డీ ఏ నుండి టీడీపీ బయటకు వచ్చిన తరువాత గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కై ధర్మపోరాట దీక్షలు చేపట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విమర్శించారు. ఆ తరువాత ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత బీజేపీపైనా, మోడీపైనా పల్లెత్తుమాట అనడం లేదు చంద్రబాబు.

TDP Mahanadu Chandrababu speech

TDP Mahanadu: మోడీ పై చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్య

ఇప్పుడు తాజాగా మోడీ హైదరాబాద్ పర్యటనను పురస్కరించుకుని చంద్రబాబు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఐఎస్ బీ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న పీఎం నరేంద్ర మోడీ తన పేరు ప్రస్తావించకపోయినా ఫరవాలేదు. కానీ తెలుగు జాతి కోసం ఐఎస్ బీ ఏర్పాటునకు తాను చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఐఎస్ బీ కోసం చాాల ప్రయత్నం చేశానన్నారు. ఆనాడు ఐఎస్ బీ ఏర్పాటునకు హైదరాబాద్ తో సహా బెంగళూరు. ముంబాయి, చెన్నై లను పరిశీలిస్తున్నామని చెప్పారని చంద్రబాబు తెలిపారు. తాను వారితో మాట్లాడి హైదరాబాద్ లో ఏర్పాటు నకు ఒప్పించామని చెప్పారు.

తెలుగు వారి కోసం వందల ఆభరణాలు

ఆనాడు ఐఎస్ బీ హైదరాబాద్ కు అప్పటి ప్రధాన మంత్ర వాజ్ పేయి వచ్చి శంకుస్థాపన చేశారన్నారు చంద్రబాబు. ఇది ఒక ఆభరణంగా మారిందన్నారు. అలాంటి వందల ఆభరణాలను తెలుగు వారి కోసం టీడీపీ తీసుకువచ్చిందని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీ యావత్ భారతదేశాన్ని ఆదుకుందని చెప్పారు. అలాగే ఐటీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన విషయాన్ని మరో సారి గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. కాగా ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. ఏపితో పాటు తెలంగాణ నుండి టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.


Share
somaraju sharma

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

5 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

5 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

17 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago