లోక్ సభ నుంచి టిడిపి సభ్యుల సస్పెన్షన్

లోక్ సభలో వాయిదాల పర్వానికి ఇప్పుడు సస్పెన్షన్ల పర్వం తోడైంది. నిన్న అన్నాడీఎంకే సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ రోజు తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేశారు. అన్నాడీఎంకే సభ్యులన సభ నుంచి ఐదు రోజుల పాటు సస్పెండ్ చేయగా, ఈ రోజు తెలుగుదేశం సభ్యులను సభ నుంచి నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని తెలుగుదేశం సభ్యులు గల్లా జయదేవ్, మురళీమోహన్, కింజారపు రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, బుటా రేణుక, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాగంటి బాబు, శ్రీరాం, మల్యాద్రి, అశోకగజపతి రాజు, జేసీ దివాకరరెడ్డి, కోకనళ్ల నారాయణలను సభ నుంచి నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ అనంతరం సభను రెండు గంటలకు వాయిదా వేశారు.