జగన్ తో భేటీ !

Share

అమరావతి: సీఎం జగన్‌తో టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం భేటీ అయ్యారు. రైతాంగ సమస్య పై వంశీ జగన్ ను కలిసినా ఇది రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీస్తున్నది.

పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎంను వంశీ కోరారు. ఇప్పటికే సీఎంకు రెండు రోజుల క్రితం వంశీ లేఖ రాశారు. తాజాగా ఆయనతో గురువారం భేటీ అయ్యారు. పోలవరం కుడికాల్వ నుంచి గోదావరి జలాలను గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు తరలించేందుకు సహకరించాలని సీఎంకు వంశీ విజ్ఞప్తి చేశారు.

గత నాలుగేళ్లుగా సొంత ఖర్చులతో 500 మోటార్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లించాననీ, దీనికి అవసరమయ్యే విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే విద్యుత్తు సరఫరా ఇచ్చేలా విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వంశీ కోరారు.

వంశీ విజ్ఞప్తిపై జగన్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

కాగా వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయనపై పరాజయం పాలైన వైసిపి అభ్యర్థి వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ చేసిన తరుణంలో జగన్ తో వంశీ భేటీ కావడం చర్చనీయాంశం అయ్యింది.


Share

Related posts

కొడుకు పుట్టిన గంటకే కన్నతండ్రి మరణం.. కారణమేంటంటే?

Teja

బిగ్ బాస్ 4: స్టూడియో లో ఫైర్ యాక్సిడెంట్… బిగ్ బాస్ హౌస్ కాలింది అనే న్యూస్ పై స్పందించిన నాగార్జున..!!

sekhar

చేతులు కలిపిన జగన్ – చంద్రబాబు… మధ్యలో వచ్చినోళ్లని నలిపి విసిరేశారు!

CMR

Leave a Comment