ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి అసెంబ్లీ ఆఖరి రోజు టీడీపీ సభ్యులు సస్పెన్షన్

Share

ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. టీడీపీ సభ్యులు పేపర్లు చింపి మీదకు వేయడంతో స్పీకర్ తమ్మినేని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద కు టీడీపీ సభ్యులు దూసుకువెళ్లి నినాదాలు చేస్తుండటంతో టీడీపీ సభ్యులందరినీ స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.

AP Assembly

ఉదయం సభ వాయిదా పడి తిరిగి ప్రారంభం అయిన వెంటనే సభలో బిల్లులు ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలోనే బిల్లులను శాసనసభ ఆమోదించింది. స్పీకర్ సస్పెండ్ చేసినా టీడీపీ సభ్యులు ఎంత వరకూ బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ ద్వారా వారిని బలవంతంగా బయటకు పంపారు. అనంతరం అధికార పక్ష సభ్యులు చంద్రబాబు తీరును తీవ్రంగా విమర్శించారు.

ఏబీఎన్ రాధాకృష్ణతో చంద్రబాబు సంభాషణ వీడియోను అసెంబ్లీలో ప్లే చేశారు. ఎన్టీఆర్ పై వారికి ఏ మాత్రం గౌరవం ఉందో అర్ధం అవుతోందని మంత్రి విడతల రజిని విమర్శించారు. ఎన్టీఆర్ పై సీఎం వైఎస్ జగన్ కు అపార గౌరవం ఉండబట్టే ఒక జిల్లకు ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగిందన్నారు. అసెంబ్లీలో టీడీపీ డ్రామాలు చేస్తొందని విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆయనను ఎంత అవమానించారో అందరికీ తెలుసునని అధికార సభ్యులు వివరించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆయనను ఎంత అవమానించారో అందరికీ తెలుసునని అధికార సభ్యులు వివరించారు. హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు ఎందుకు పెట్టడం జరుగుతుందో వివరించారు మంత్రి విడతల రజిని.

ఏపి అసెంబ్లీలో ఎన్టీఆర్ వర్సిటీపై రగడ .. సభ కొద్దిసేపు వాయిదా


Share

Related posts

సీఎం జగన్ X జస్టిస్ రమణ ; “న్యూస్ ఆర్బిట్” పోల్ ఏం చెప్తుంది..!?

Srinivas Manem

Vijaya Sai Reddy: విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి

somaraju sharma

“సార్ ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలీకుండా ఇద్దరు అమ్మాయిలు కలిసి” నెల్లూరు పోలీసులకి ఫోన్ వచ్చింది…!

arun kanna