NewsOrbit
న్యూస్

‘బాబు టార్గెట్‌గా కుట్ర’

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబును అంత మొందించేందుకు వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో వైసిపిప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబును టార్గెట్‌గా చేసుకొని ఆయన ఇంటి వద్ద మంత్రులే రెక్కీ నిర్వహిస్తున్నారని బుద్దా ఆరోపించారు. వారి కుట్రలు, కుతంత్రాలు ఇలానే కొనసాగిస్తే ఇక్కడి ప్రభుత్వ పరిస్థితి దేశ వ్యాప్తంగా తెలిసేందుకు తాను సిఎం  జగన్మోహనరెడ్డి ఇంటి ముందే ప్రాణత్యాగానికి సిద్ధమవుతానని బుద్దా హెచ్చరించారు.

వైసిపి మాదిరిగా చంద్రబాబు వ్యవహరించి ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే ఉండేది కాదనీ, కానీ ఆయన నైజం అటువంటిది కాదని బుద్దా పేర్కొన్నారు. జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా టిడిపి ప్రభుత్వం ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడం జరిగిందని బుద్దా గుర్తు చేశారు. ఆయన పాదయాత్ర సమయంలోనూ పటిష్ట భద్రతను ప్రభుత్వం కల్పించిందని బుద్దా చెప్పుకొచ్చారు.

వరదను అడ్డం పెట్టుకొని డ్రోన్‌తో చంద్రబాబు నివాసం వద్ద రెక్కీ నిర్వహించారని ఆయన ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబును టార్గెట్‌గా వ్యవహరిస్తున్నట్లు కనబడుతోందనీ, అందులో భాగంగానే చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించారని బుద్దా అన్నారు. సెక్యూరిటీ విషయంపై హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని బుద్దా గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశించినా ఇంత వరకూ భద్రత పెంచలేదని బుద్దా అన్నారు. జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత కల్గి ఉన్న నేత ఇంటి పరిసరాలు హై సెక్యూరిటీ జోన్ పరిధికి వస్తుందనీ, ఆ ప్రాంతంలో  డ్రోన్ వినియోగించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి ఉంటుందని బుద్దా అన్నారు. అటువంటిది ఏమీ లేకుండా డ్రోన్ వినియోగించారంటే ఆయన్ను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించినట్లుగానే భావించాల్సి ఉంటుందని బుద్దా ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని బుద్దా పేర్కొన్నారు.

‌ఇక్కడి ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని బుద్దా అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబును ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని బుద్దా పేర్కొన్నారు. చంద్రబాబు భద్రత విషయంపై ప్రధాని మోది, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌షాకు లేఖలు రాయనున్నట్లు బుద్దా తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

Leave a Comment