NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌కు వ‌చ్చే వారంలో ఎన్ని స‌మ‌స్య‌లంటే….

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు వివాదాద‌స్పదంగా మారుతున్నాయి. ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య కాద‌ని ప్ర‌భుత్వం క్లారిటీ ఇస్తున్న‌ప్ప‌టికీ, హిందూ మ‌త‌స్తులు మాత్రం వ‌రుస ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో క‌ల‌వ‌రం చెందుతున్నారు.

మ‌రోవైపు క‌ఠిన చ‌ర్య‌లు లేక‌పోవ‌డం సైతం విప‌క్షాలు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసేందుకు అవ‌కాశం ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసగా ఆదివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పూజలు నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయింది.

టీడీపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌లు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుండి శనివారం వరకు సూర్య దేవాలయాల వద్ద పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిస్తున్నామ‌ని తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌లు, మాజీ మంత్రులు నిమ్మ‌కా‌‌యల‌ చిన్న రాజప్ప, గొల్లపల్లి సూర్యారావు కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించాలని కోరారు. అంతర్వేదిలో నరసింహస్వామి రధం దగ్దం చేసిన దుండగుల్ని పట్టుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనతకు వ్యతిరేకంగా, ప్రతిపక్షాలపై అక్రమ నిర్బంధాలు, కేసులకు వ్యతిరేకంగా నేడు రాజోలు నియోజకవర్గంలో బందు చేపట్ట‌నున్న‌ట్లు తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌లు ప్ర‌క‌టించారు.

కొన్ని రోజులుగా ఇదేం ప‌రిస్థితి?

గత కొన్ని రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, పూజారులపై దాడులు అనేకం జరుగుతున్నాయని మాజీ మంత్రులు నిమ్మ‌కా‌‌యల‌ చిన్న రాజప్ప, గొల్లపల్లి సూర్యారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గోశాలల్లో గోవుల పోషణ నిర్వహణలో నిర్లక్ష్యం జరుగుతోందని త‌ద్వారా గోవులు మృతి చెందుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేవాలయాల భూముల కబ్జాను అరికట్టడంలో ప్రభుత్వ వైఫ్యల్యానికి వ్యతిరేకంగా వారం నిరసన కార్యక్రమాలు జరపాలని నిర్ణయించడమైందని వారు వెల్ల‌డించారు. ఇందులో భాగంగా రాబోయే ఆదివారం సూర్యదేవాలయాల వద్ద పూజులు, ప్రార్థనలు సోమవారం శివాలయాల్లో ప్రార్థనలు, మంగళవారం ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి గుడులు, బుధవారం అయ్యప్ప గుడుల్లో ప్రార్థనలు ,గురువారం సాయిబాబా మందిరాల్లో, శుక్రవారం  అమ్మవారి ఆలయాల్లో శనివారం విష్ణు ఆలయాల్లో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పూజలు, ప్రార్థనలు నిర్వహించాల‌ని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాజోలు బందులో పార్టీలకు అతీతంగా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.కాగా, టీడీపీ చేప‌ట్టిన ఈ నిర‌స‌న కార్యక్ర‌మాల ప‌ట్ల వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

author avatar
sridhar

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju