NewsOrbit
న్యూస్

TDP Office Attacks: బీహార్ ప్రొడక్షన్స్ – ఏపీలో పాలిటిక్స్..! “బొసీడీకేలు – లుచ్చాలు – నా కొడకాలు” !?

Babu Tension - Minister HighRisk One Point..

TDP Office Attacks: అప్పుడెప్పుడో 2006లో ఓ సారి అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు (TDP Chandrababu) ని ఉద్దేశించి.. సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekha Reddy) “చంద్రబాబు (Nara Chandrababi Naidu) నిన్ను కడిగేస్తా ఈరోజు.. మీ అమ్మ కడుపున ఎందుకు పుట్టానా..? అని నువ్వు బాధపడేలా కడిగేస్తా” అన్నారు.. విద్యుత్తు ధరల పెంపుపై చర్చ సందర్భంగా వైఎస్.., చంద్రబాబుని ఇరుకున పెట్టేలా ఘాటుగా మాట్లాడారు. ఆ తర్వాత దానిపై ఆయన విచారం వ్యక్తం చేసారు. చంద్రబాబుపై కొన్ని సెటైర్లు వేస్తూనే పరోక్షంగా క్షమాపణ చెప్పారు. చంద్రబాబు కూడా ఒక్కోసారి బిక్క మొహం పెట్టుకుంటూ.., ఒక్కోసారి నవ్వుకుంటూ.. ఒక్కోసారి సైలెంట్ గా ఉంటూ ఢీ కొట్టేవారు..! అలా నాటి రాజకీయాలు ఏపీలో కొంచెం సెటైరికల్, కొంచెం హుందాతనం.. కొంచెం కన్నింగ్.. కొంచెం పౌరుషంతో ఉంది ఉండేవి..!

కానీ ఏనాడూ “నీ అమ్మ మొగుడు, బొసీడీకె సీఎం, పాలేరు గాడు, లుచ్చా, నా కొడకా, అసెంబ్లీలో పాతేస్తా” అనే మాటలు రాలేదు. ఏపీ రాజకీయాల్లో గత ఆరేళ్లుగా మాత్రమే ఇటువంటి ఇంపైన మాటలు వింటున్నాం. ఇప్పుడు ఆ మాటలు శృతిమించి.. దాడుల వరకు వెళ్లాయి. ఈ మాటల దాడిని ఆరంభించింది చంద్రబాబు బృందం అయితే.. దాన్ని పీక్స్ కి తీసుకెళ్లి, చంద్రబాబుకే చుక్కలు చూపిస్తున్నది జగన్ బృందం..!

TDP Office Attack: Bihar Productions - AP Politics
TDP Office Attacks Bihar Productions AP Politics

TDP Office Attacks: 2014 – 2019 మధ్యలోనే హుందా పోయింది..!

2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అంటే సీనియర్ల పార్టీ. దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సీనియర్లు, ముదుర్లు ఉండేవారు.. కానీ 2014 లో టీడీపీ గెలిచిన ఏడాది నుండి శాసనసభ సాక్షిగా హుందాతనం పోయింది. ఆ సభలో వివాదాలు బయటకు కూడా పొక్కి, బయట కూడా పూర్తిగా మాటలు దిగజారాయి. నాడు అధికార పక్షంలో ఉన్న టీడీపీ శాసనసభ్యుడు బోండా ఉమా కొడాలి నానిని ఉద్దేశించి.. “ఏంట్రా.. ఏంటి.. అసెంబ్లీలో గొయ్యి తీసి పాతేస్తా..” అంటూ గంతులేశారు. ఓ సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని నాటి ప్రతిపక్ష నేత జగన్ ని ఉద్దేశించి “నీ తాత, నీ తండ్రి అంటూ నీ చరిత్ర మొత్తం తిరగేసి బజారుకీడుస్తా” అంటూ వేలు చూపించి హెచ్చరించారు.. అలా టీడీపీ మాటల దాడి మొదలు పెట్టింది. అదే సమయంలో వైసీపీ సభ్యుల్లో కూడా కోపాలు, ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుని శృతి మించేవి. ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని తదితరులు టీడీపీపై ఢీ అంటే ఢీ అనే వాళ్ళు. ఓ సందర్భంలో ఎమ్మెల్యే రోజా పెట్టిన హావభావాలతో శాసనసభ చరిత్రలోనే ఓ మహిళా ఎమ్మెల్యేకు మచ్చ ఏర్పడింది..! అలా సభ లోపల, బయట టీడీపీ, వైసీపీ పాక్షిక బూతు పురాణం మొదలయింది. బీజం పడింది..! బీజం అన్నాక పెరిగి పెద్దదవుతుంది కదా.., దాని ఫలితం కూడా పెద్దగానే ఉంటుంది కదా..! అదే ఇది..

TDP Office Attack: Bihar Productions - AP Politics
TDP Office Attacks Bihar Productions AP Politics

 

TDP Office Attacks: బీహారోళ్లు ఎంట్రీతో కథ మారింది..!!

2017 లో నాటి ప్రతిపక్షం వైసీపీతో బీహార్ కి చెందిన రాజకీయ స్ట్రాటజిస్టు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ చేరారు. నాటి నంద్యాల ఉప ఎన్నికల్లోనే జగన్ అప్పటి ప్రభుత్వాన్ని సహనం పరీక్షించేలా మాట్లాడారు. సీఎం చంద్రబాబుని పట్టుకుని “బహిరంగంగా ఉరి తీయాలి, కాల్చేయాలి” అంటూ పరుష వ్యాఖ్యలు చేసారు. ఇవన్నీ బీహార్ ప్రొడక్షన్స్ వాళ్ళ తెలివి కాబోలు.. సీఎం ని పట్టుకుని స్ట్రాంగ్ గా మాట్లాడితే.. వాళ్ళు సహనం కోల్పోతే.. తప్పులు చేస్తే.. మైలేజీ తీసుకునే తెలివి.. కానీ నాడు అది వర్కవుట్ అవ్వలేదు. టీడీపీ శ్రేణులు అధికారాన్ని అనుభవించే పనిలో ఉంటూ జగన్ వ్యాఖ్యల పట్ల పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత 2019 వరకు ఈ తరహా రాజకీయం కొనసాగుతూ వచ్చింది. 2019 ఎన్నికల ప్రచారంలో ఇది ఇంకాస్త అధికమైంది.. మరి బీహారోళ్లకు “మమ్మల్ని గెలిపించండి అని డబ్బులిస్తున్నప్పుడు… వాళ్ళు చెప్పిన గబ్బు పనులన్నీ చేయాలి కదా..!

TDP Office Attack: Bihar Productions - AP Politics
TDP Office Attacks Bihar Productions AP Politics

ఇప్పుడు ఇరువురు వంతు..!!

ఇక ఇలా మాట్లాడడంలో పీహెచ్దీ పట్టా పొందిన కొడాలి నాని.. మంత్రిగా తనకు తిరుగులేకపోవడంతో రచ్చ చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతీసారి “లుచ్చా, బచ్చా, ఏం పీకుతాడు, సన్నాసి, వెధవ, వాడి అమ్మ మొగుడు” అనేలా మాట్లాడుతూ వచ్చారు.. కొడాలి నాని మాటలెలా ఉన్నాయంటే… “చంద్రబాబు పెద్ద లుచ్చా గాడు.. బొచ్చు బోశానం గాడు.. వెధవ.. సన్నాసి.. నీచుడు.. లుచ్చా గాడు.. పప్పు గాడు, తుప్పు గాడు.. పెద్ద శనిగాడు.. చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపిన సన్నాసి, పేకాట క్లబ్బులు నడిపిన వెధవ.. చంద్రబాబు మనిషి జన్మ ఎత్తలేదు.. సిగ్గూ షరం లేదు.. మగాడివి అయితే, దమ్ముంటే గుడివాడలో నాతో పాటు పోటీ చెయ్..” అంటూ పదే పదే ఇదెలా మాట్లాడేవారు. ఇక టీడీపీ కూడా అదే స్థాయికి వెళ్ళింది. పట్టాభి రూపంలో వారికి ఒక మాట్లాడే బఫున్ దొరికింది. ఏ మాత్రం తీసిపోని అన్నట్టు.. ఈ పట్టాభి వారానికో ప్రెస్ మీట్ పెడుతూ పేట్రేగిపోతున్నారు. రెండునెలల కిందట నారా లోకేష్ సీఎం జగన్ ని “రారా.. దమ్ముంటే రారా” అంటూ సవాల్ విసిరారు.. నిన్నటికి నిన్న సీఎంని పట్టుకుని.. పాలెగాడు, పబ్జీ గాడు, 420 గాడు, దమ్ముంటే రా..,” అంటూ పట్టాభి రెచ్చిపోయారు. సో.. వైసీపీకి పీకే అనే ఎం\బీహారీ స్ట్రాటజిస్టు నేర్పిస్తే.. టీడీపీకి ఆ పీకే శిష్యుడు బీహార్ మరో ప్రోడక్ట్ అయిన రాబిన్ సింగ్ నేర్పుతున్నాడు..! ఇది పార్టీలకు కాదు, ప్రజలకే పరీక్ష, ప్రజల చెవులకు శిక్ష..!

author avatar
Srinivas Manem

Related posts

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N