కాపు కాసేది మేమే

Share


గుంటూరు, డిసెంబర్ 27 : గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ భవనాన్ని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గురువారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కాపు కార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ మంత్రి శనక్కాయల అరుణలతో కలిసి ప్రారంభించారు. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా కాపులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్ళు అయినా ఏ ప్రభుత్వాలు కాపులను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల కోసం 350 కల్యాణ మండపాలను నిర్మించుకుంటున్నామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ కోసం సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హమీలను నెరవేరుస్తున్నారని చెప్పారు. గత పాలకులు కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని, విదేశీ చదవుకు చేయూత, కార్పోరేషన్ రుణాలు ఎన్నో ప్రభుత్వం చేస్తుందన్నారు. కాపు రిజర్వేషన్ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. రాబోయ్యే రోజుల్లో బిజెపి యేతర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, అప్పుడు కాపు రిజర్వేషన్ బిల్లు ఆమోదించుకుంటామని చెప్ప‌ారు.
కాపు కార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ ఆర్థికంగా, విద్యా పరంగా, రాజకీయంగా, వ్యాపారపరంగా కాపులకు అండగా ఉంటున్న తెదేపా ప్రభుత్వమేనన్నారు. ఏడాదికి వెయ్యి కోట్లు కాపు కార్పోరేషన్‌కు ఇస్తున్నాం. పేద పిల్లలకు విదేశీ విద్య, పోటీ పరీక్షలకు శిక్షణ, కార్పోరేషన్ రుణాలు ఇలా ఎన్నో చేస్తుందని సుబ్బారాయుడు అన్నారు.
కాగా అడవినెక్కలపాడుపాడులో ఐదు కోట్లతో నిర్మిస్తున్న కాపు భవనానికి మంత్రులు నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావులు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ తదితరులు పాల్లొన్నారు.


Share

Related posts

Big Breaking: కాబోయే రాజధాాని ప్రాంతంలో దారుణ మారణకాండ …! హత్య, ఆత్మహత్యలతో దద్దరిల్లిన విశాఖ..!!

somaraju sharma

Minister Suresh: చంద్రబాబు లోకేష్ లపై మంత్రి సురేష్ సూపర్ పంచ్!మేటర్ ఏంటంటే??

Yandamuri

Israel: టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయిన భారత సంతతి అమ్మాయి ఫ్యామిలీకి ఇజ్రాయెల్ అధినేత భరోసా..!!

sekhar

Leave a Comment