NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP : రెట్టించిన ఉత్సాహంతో మున్సిపోల్స్ కి సిద్ధమౌతున్న టిడిపి!ప్రజల్లోకి వెళ్లడానికి చంద్రబాబు సన్నాహాలు?

TDP : పంచాయతీ పోరు ముగిసింది.. ఇక పురపోరుకు ఏపీ సిద్ధమవుతోంది.. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంటే.. పార్టీలన్నీ గెలుపు కోసం అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి.. ముఖ్యంగా అధికార వైసీపీకి మరోషాకిచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.. మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్క అంటూ పురపోరులో తడాఖా చూపిస్తామంటోంది టీడీపీ..

TDP preparing for municipalities with double enthusiasm! Chandrababu preparations to go to the people?
TDP preparing for municipalities with double enthusiasm! Chandrababu preparations to go to the people?

TDP : పుంజుకున్న టిడిపి!

పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్‌తో పురపోరుకు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల లో తెలుగుదేశం పార్టీ ఆశించిన దాని కంటే అధికంగానే విజయాలు లభించాయి.టిడిపి చెప్పుకుంటున్నట్లు నాలుగువేల పంచాయతీలు రాకపోయినా పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో వచ్చి ఉంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి తో పోలిస్తే ఇది టీడీపీకి బాగా ఊపునిచ్చే అంశమే.175 అసెంబ్లీ సీట్లకుగాను కేవలం ఇరవై మూడింటిని గెలిచిన టీడీపీ త్వరగానే పుంజుకుందని భావించవచ్చు.ఇదే టీడీపీకి బాగా ఉత్సాహం కలిగించే అంశం.

ఇక ఫోకస్ అంతా మున్సిపల్ ఎన్నికలపైనే!

దీంతో 12 కార్పొరేష‌న్లు, 75 మున్సిపాలిటీలకు మార్చిలో జరగనున్న ఎన్నిక‌ల‌ను స‌వాల్‌గా తీసుకున్నారు. ఇప్పటికే నేత‌ల‌ మధ్య నెలకొన్న విభేదాలపై దృష్టిపెట్టిన అధినేత‌ చంద్రబాబు.. వాటిని స్వయంగా పరిష్కరిస్తున్నారు.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగియ‌డంతో మార్చిలో జరిగే మున్సిపల్‌ ఎన్నికలపైనే చర్చంతా నడుస్తోంది. వ‌చ్చే నెల 10న జ‌రిగే పుర సమరానికి పార్టీలన్నీ స‌మాయ‌త్తం అవుతుండగా, టీడీపీ ఈఎన్నికలను మరింత సీరియస్‌గా తీసుకుంది. పంచాయ‌తీ ఎన్నికల్లో అధికార వైసీపీకి గ‌ట్టి పోటీ ఇవ్వగా.. త‌మ‌కు క‌లిసి వ‌చ్చే పట్టణ ప్రాంత ఎన్నిక‌ల్లో మంచి ఫలితాలు సాధించాలని భావిస్తోంది. పుర‌పాలక ఎన్నిక‌ల్లో విజయం కోసం వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీలోని ముఖ్యుల‌ను అంద‌రినీ ప్రచార రంగంలోకి దించుతోంది.టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కూడా ఇవి పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ప్రధాన మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

 

author avatar
Yandamuri

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?