NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP ; చంద్రబాబు – చారిత్రక కష్టాలు..! అటు పరువు – ఇటు నమ్మకం..!!

TDP తిరుపతి ఎంపీ స్థానం ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారయింది. అభ్యర్థులు సిద్ధమయ్యారు. నామినేషన్లు కూడా వేసుకుంటున్నారు. వైసీపీ ధీమాగా ఉంటూ ఆధిక్యత లెక్కలు వేసుకుంటుండగా.., బీజేపీ – జనసేన పెరిగిన బలాన్ని చుపించాలనుకుంటున్నాయి. టీడీపీ మాత్రం తమ బలం తగ్గకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతుంది. మొత్తానికి ఇక్కడ విజేత ఫిక్స్. కాకపోతే ఎవరికీ ఎన్ని ఓట్లు, ఎవరి బలం ఎంత అనేదే తేలాల్సి ఉంది. ఇతర పార్టీల సంగతి పక్కన పెట్టి టీడీపీ మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పోటీలో దిగుతుంది..!

TDP statistics in tirupati
TDP statistics in tirupati

పోటీలో లేకుండా ఉంటే.. మంచి అవకాశమే..!!

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ బలీయమైన శక్తిగా ఉంది. టీడీపీ తమ పాత శక్తిని పోగు చేసుకునే పనిలో ఉంది. బీజేపీ ఉనికి కోసం తాపత్రయ పడుతుంది. జనసేన ప్రభావం చూపాలనుకుంటుంది..! నిజానికి ఈ మూడు పార్టీలు శత్రువులు అయితే… ఒకరిని ఓడించడానికి మరో ఇద్దరు కలిసినా తప్పు లేదు. బీజేపీకి ఉన్న అవసరాల దృష్ట్యా…, తిరుపతి ఎంపీ స్థానంలో వైసిపిని ఓడించాలి అనుకుంటే టీడీపీ మద్దతు తీసుకోవచ్చు. టీడీపీ – జనసేన – బీజేపీ కలిపి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించి గెలుపు ప్రయత్నాలు చేయవచ్చు.

అదే జరిగితే వైసిపికి కష్టమైన ఎన్నిక అయ్యేది. కానీ.. ఎవరికీ వారు విడిగా పోటీ కారణంగా ఈ మూడు (టీడీపీ, జనసేన, బీజేపీ)లకు వచ్చే ప్రాధాన్యత ఏమి లేదు. పైగా చంద్రబాబుకి మనసులో బీజేపీతో కలవాలి.., జనసేనతో కలవాలి అనే ఉంటుంది. వైసిపిని ఒంటరిగా ఢీకొనడం కష్టమని బాగా తెలుసు. అందుకే తిరుపతి ఉప ఎన్నికలు వేదికగా చేసుకుని బీజేపీతో స్నేహం చేస్తే.. వాళ్ళు అంగీకరించకపోయినా టీడీపీ ఓట్లు అటు డైవర్ట్ చేస్తే టీడీపీ పరిస్థితి మరోలా ఉండేది.

TDP statistics in tirupati
TDP statistics in tirupati

TDP ఫలితం దారుణంగా ఉంటే..!? పరువో..? నమ్మకమో..!?

“టీడీపీ కచ్చితంగా పోటీ చేయాల్సిందే.. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోతే ఎలా..!? పార్టీ శ్రేణుల్లో నమ్మకం పోతుంది. పార్టీపై మచ్చ వచ్చేస్తుంది” అని ఆలోచించిన వారు ఉన్నారు. పోటీ చేస్తే వచ్చే తక్కువ ఓట్లు కంటే.. పోటీ చేయకుండా బీజేపీకి మద్దతివ్వడం వలన వచ్చే ప్రయోజనం అధికంగా ఉండేది. ఇప్పుడు టీడీపీకి పరువు సమస్యగా మారింది. 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ పరిధిలో టీడీపీకి 4 . 94 లక్షల ఓట్లు వచ్చాయి.

ఇప్పుడు అదే సంఖ్యలో ఓట్లు వస్తే పార్టీకి కొంచెం పరువు, ప్రతిష్ట, నమ్మకం నిలబడతాయి. అలా కాకుండా టీడీపీకి వచ్చే ఓట్లు కేవలం 3 లక్షలకు.., అంత కంటే తక్కువకు పరిమితం అయితే మాత్రం టీడీపీలో ఎన్నడూ లేని దారుణమైన అపనమ్మకం ఏర్పడుతుంది. అభద్రతా ఆవహిస్తుంది. ఈ అపనమ్మకం, భద్రతలు రాకుండా ఉండేందుకు.., కొంచెమైనా పరువు నిలుకునేందుకు చంద్రబాబు బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా ఉంటూ గెలిపించే బాధ్యత భుజాన వేసుకోవాల్సింది. అదే జరిగితే తమ్ముళ్లకు నమ్మకం కుదిరేది. గెలిపించారన్న పేరు దక్కేది..!!

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju