NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nara Lokesh: పది,ఇంటర్ పరీక్షలు రద్దు చేయించింది “అతడొక్కడే” నట!లోకేష్ కు బూస్టప్ ఇవ్వడానికి టిడిపి నానా పాట్లు !!

Nara Lokesh: “అతనొక్కడే “అంటూ ఒక టిడిపి ఎమ్మెల్యే కీర్తించగా,ఆయన చిత్రపటానికి విజయవాడలో విద్యార్థులు పాలాభిషేకాలు చేసి జిందాబాద్ లు కొట్టారు.ఇంతకీ ఆయన ఎవరంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు!ఆయన సాధించిన విజయం ఏమిటంటే ఏపీలో పది,ఇంటర్ పరీక్షలు రద్దు చేయించడమట.వినడానికే ఇది విచిత్రంగా ఉంది కదా!ఇది ఏ విధంగా లోకేష్ విజయమో అర్థం కాని పరిస్థితి నెలకొంది.ఆయన ఈ పరీక్షల రద్దు కోసం డిమాండ్ చేసిన విషయం వాస్తవం.విద్యార్థులను,వారి తల్లిదండ్రులను కూడా కొద్దిగా జూమ్ కాన్ఫరెన్సుల్లో చైతన్యపరిచారు.అంతటితో ఆయన పాత్ర ముగిసింది.విషయం కోర్టు వరకు వెళ్లింది.కోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం ఈ పరీక్షలను రద్దు చేసింది.ఇందులో లోకేశ్ గొప్పతనం ఏమిటనేది ఇక్కడ జవాబు దొరకని ప్రశ్న.

TDP strugles to give a boost to Lokesh !!
TDP strugles to give a boost to Lokesh

అసలేం జరిగిందంటే!

విద్యార్థుల భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఎలాగైనా పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని తలపెట్టింది.ఈ రెండు పరీక్షలే భవిష్యత్తులో విద్యార్ధుల కెరీర్ కి సోపానాలు కాబట్టి ఆ పరీక్షలు నిర్వహించటానికి తాపత్రయపడింది.ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అందుకనుగుణంగా వాటిని వాయిదా వేస్తూ వస్తోంది.ఈలోపు విషయం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది.ఈ దశలో సుప్రీంకోర్టు జులై 31లోగా పరీక్షలు ముగించి, ఫలితాలు ప్రకటించాలని, అలా చేయగలిగితేనే వచ్చే విద్యా సంవత్సరం విషయంలో అన్ని రాష్ట్రాల్లోనూ సారూప్యత ఉంటుందని సూచించింది.అయితే సుప్రీంకోర్టు విధించిన జూలై 31 డెడ్ లైన్ లోగా పరీక్షల నిర్వహణ సాధ్యపడదన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ ప్రభుత్వం పదో తరగతి,ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.దీన్నిబట్టి ఎవరికైనా ఆర్ధమౌతున్నదేమిటంటే కేవలం సుప్రీంకోర్టు కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకుని, వాటిని అధ్యయనం చేసి,సాధ్యాసాధ్యాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల రద్దు వంటి కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో మరెవరి ప్రమేయం లేదు.

ఇదెలా లోకేష్ విజయమబ్బా?

కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది లోకేష్ విజయమన్నట్లుగా ప్రచార దుందుభి మోగిస్తోంది.కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా సెలబ్రేషన్సు జరుపుకొంటోంది.ఎమ్మెల్యేలు లోకేష్ ను కీర్తిస్తూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం,టిడిపి స్పాన్సర్డ్ విద్యార్ధులు లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేయడం వంటివి రాష్ట్రంలో శుక్రవారం జరిగాయి.ఇంకా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లోకేషే ఇచ్చినట్లుగా టిడిపి వర్గాలు సంబరపడుతుండడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju