NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రాజధానిపై మళ్లీ హైకోర్టుకు టీడీపీ…! అదే పాయింట్ లేవనెత్తాలన్నదే వ్యూహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చేత ఆమోదం పొందిన మూడు రాజధానులు బిల్లుని మండలిలో ఎంతో చాకచక్యంగా అడ్డగించిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆ బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర పడడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు. తమ భూములు కొనిపెట్టుకున్న అమరావతి మాత్రమే రాజధాని గా ఉండాలి అంటూ టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ ఆమోదముద్ర వేయడని టిడిపి ఏ మూలో చిన్న ఆశ పెట్టుకొని ఉన్నట్టున్నారు.అయితే నిమ్మగడ్డ నియామకం హైకోర్టు నుంచి వచ్చిన డైరెక్ట్ ఉత్తర్వులు కాబట్టి గవర్నర్ వేరే దారిలేక జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించాడు. కానీ అందరూ అనుకున్నట్టే చివరికి మూడు రాజధాని విషయమై పాజిటివ్ గా స్పందించాడు.

ఇక ఇప్పుడు గవర్నర్ నిర్ణయం పై తాము హైకోర్టుకు వెళ్ళబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించారు. గవర్నర్ నిర్ణయం పై హైకోర్టులో టిడిపి వారు పిటిషన్ వేయనున్నారు.ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయాలకు సంబంధించి చాలాసార్లు హైకోర్టును ఆశ్రయించిన టిడిపి తాజాగా రాజధాని అంశంపై కూడా కోర్టు మెట్లు ఎక్కబోతోంది.

ఇక పిటిషన్ వేసిన తర్వాత అంకం ఆ బిల్లు విషయంలో వారు గవర్నర్ కు వ్యతిరేకంగా లేవనెత్తే పాయింట్. బిల్లు మండలిలో పెండింగ్ లో ఉంది.. దాన్ని గవర్నర్ అయినా ఎలా ఆమోదిస్తారు అన్నది తెలుగుదేశం పార్టీ వాదన.హై కోర్టులో ఈ వాదన చెల్లకపోవచ్చు. ఎందుకంటే మండలికి ఏ బిల్లు వచ్చినా కూడా కొద్ది రోజుల పాటే పెండింగ్ లో ఉంటుంది. ఆ తర్వాత ఆమోదం పొందినా.

పొందకపోయినా అసెంబ్లీ ఆమోదిస్తే చాలు అని రాజ్యాంగబద్ధంగా గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ మొన్న వ్యూహాత్మకంగా రెండో సారి అసెంబ్లీలో బిల్లుని పెట్టి మండల కి తరలించారు. ఇక అప్పట్లో ఎలాంటి సెలెక్ట్ కమిటీ కార్యరూపం దాల్చని నేపథ్యంలో టిడిపికి ఈసారి మాత్రం హైకోర్టు దగ్గర నుండి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

author avatar
arun kanna

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!