NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

స‌ర్వేప‌ల్లిపై టీడీపీ కుస్తీ.. కాకాణి బ‌ల‌మెంత‌…!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఒకటి. జిల్లాలో ఈ నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనది. కృష్ణపట్నం పోర్టు సహా నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు ఇండస్ట్రియల్ ఏరియా అంతా ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెల్లూరు నగరంలో కూడా ఈ స్థాయిలో భూముల ధరలు ఉండవంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేందుకు నాయకులు శాయశక్తులు ఒడ్డుతారు. ఎందాకైనా ప్రయత్నం చేస్తారు.

ఒకరకంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి హాట్ సీట్ లాంటిది. ప్రస్తుతం ఇక్కడ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా ఆయనే ఇక్కడ వైసీపీ తరపున పోటీలో నిలుస్తారు. టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు క్లారిటీ లేదు. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు నగరం చుట్టూ విస్తరించి ఉంటుంది. నెల్లూరు అర్బన్, రూరల్ నియోజకవర్గాలతోపాటు, కోవూరు, ఆత్మకూరు, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలతో సరిహద్దుని పంచుకుంటుంది. జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉన్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి.

ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం సర్వేపల్లి. 1955లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యే అయ్యారు. సీపీఐ అభ్యర్థి కె.బి.రెడ్డిపై 14,622 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, వైసీపీ, ఇండిపెండెంట్లు కూడా గెలవడం విశేషం. అంటే ఇండిపెండెంట్ తో సహా దాదాపు అన్ని పార్టీల వారిని ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు. ఇది జనరల్ నియోజకవర్గం అయినా కూడా రెండుసార్లు ఎస్సీ నేతలు ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించడం విశేషం.

టీడీపీ పెట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో సర్వేపల్లిలో ఎన్టీఆర్ హవా కనపడింది. 1983లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పెంచలరెడ్డి చెన్నారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1994, 1999లో వరుసగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత సోమిరెడ్డి ఇక్కడ వరుస ఓటములు ఎదుర్కొంటున్నారు. వరుసగా నాలుగుసార్లు ఆయన సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009లో ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2019లో కాకాణి గోవర్దన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించారు.

ప్రస్తుతం ఆయన జగన్ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో సోమిరెడ్డి కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. వరుస పరాజయాలతో డీలాపడ్డ సోమిరెడ్డి టీడీపీ తరపున సర్వేపల్లిలో మరోసారి బరిలో నిలుస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఆయన్ను కాదని, కొత్తగా టీడీపీలో చేరిన రూప్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. అటు వైసీపీ నుంచి మాత్రం కాకాణికి టికెట్ ఖాయమని తేలినా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మొత్తమ్మీద ఈసారి పోరు రసవత్తరంగా మారే అవకాశముంది.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N