NewsOrbit
టెక్నాలజీ న్యూస్

టెక్నో కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. త‌క్కువ ధ‌ర‌కే చ‌క్క‌ని ఫీచ‌ర్లు..!

Share

టెక్నో (TECNO) కంపెనీ స్పార్క్ 5 ప్రొ (Spark 5 Pro) ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుద‌ల చేసింది. ఇందులో 6.6 ఇంచుల డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో ఎ25 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్ వ‌ల్ల ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌లు ఉన్నాయి. మెమొరీని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో ఈ ఫోన్ ప‌నిచేస్తుంది.

TECNO Spark 5 Pro launched

డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డుల కోసం ఈ ఫోన్‌లో వేర్వేరు స్లాట్ల‌ను ఇచ్చారు. వెనుక వైపు 16 మెగాపిక్సల్ ప్ర‌ధాన కెమెరాతోపాటు 2, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు మ‌రో రెండు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. వెనుక వైపు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డీటీఎస్ సౌండ్ ఫీచ‌ర్‌ను ఈ ఫోన్‌లో పొంద‌వ‌చ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని, దానికి ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్‌లో ఇస్తున్నారు.

టెక్నో స్పార్క్ 5 ప్రొ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో ల‌భిస్తుంది. రూ.10,499 కు దీన్ని కొన‌వ‌చ్చు. మొబైల్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్ ల‌భిస్తుంది.


Share

Related posts

Sohel : అరియానాను పక్కన పెట్టుకొని వేరే అమ్మాయికి సోహెల్ ఎలా లైన్ వేస్తున్నాడో చూడండి?

Varun G

తాజా వార్త :ఈవిఎంలపై కూడా కరోనా ఎఫెక్ట్ !

Yandamuri

YS Sharmila: కొత్త ఎజెండాతో వ‌స్తున్న ష‌ర్మిల‌.. వర్క‌వుట్ అయ్యేనా?

sridhar