17నుంచి తెలంగాణా అసెంబ్లీ

హైదరాబాద్, జనవరి 5: ఈ నెల 17నుంచి 20 వరకు  తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.  ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈనెల 16న సాయంత్రం 5గంటలకు రాజ్‌భవన్‌లో  ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

17న ఉదయం 11.30 గంటలకు ప్రొటెం స్పీకర అధ్యక్షతన అసెంబ్లీ సమావేశం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. అదేరోజు స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేస్తారు. 18న స్పీకర్ ఎన్నిక, అదేరోజు స్పీకర్ అధ్యక్షతన బిఎసి సమావేశం

19న శాసన సభను ఉద్దేశించి గవర్నర్ నరశింహన్ ప్రసంగిస్తారు.

20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో   మహాకూటమిని   సీఎం కేసిఆర్ ఆధ్యరంలో టిఆర్ఎస్ పార్టీ ఓడించి తెలంగాణా రాష్ర్టంలో  తిరిగి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.