NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు .. అసెంబ్లీలో మాటల యుద్ధం

Telangana Assembly:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య సోమవారం అసెంబ్లీలో మాటల యుద్దం జరిగింది. నీటి ప్రాజెక్టులపై సోమవారం సభలో వాడివేడిగా చర్చ జరిగింది. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని, అలాంటి చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలో లేకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.

Telangana Assembly CM Revanth Reddy vs Harish Rao
Telangana Assembly CM Revanth Reddy vs Harish Rao

కరీంనగర్ ప్రజలు తరిమితే మహబూబ్ నగర్ వచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజలను కేసిఆర్ అవమానిస్తున్నారని అన్నారు. పద్మారావు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడని, పద్మారావును ప్రతిపక్ష నేతను చేయాలన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వళ్లించడం అవుతుందన్నారు. కొడంగల్ ప్రజలు తరిమితే రేవంత్ మల్కాజ్ గిరి వచ్చారంటూ కౌంటర్ ఇచ్చారు.

హాట్ హాట్ గా జరుగుతున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ ఎత్తిచూపుతుండగా, ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌంటర్ లు ఇచ్చింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని బీఆర్ఎస్ తప్పుబడుతోంది. మంగళవారం రోజున చలో నల్లగొండ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నల్లగొండ లో సభ పెట్టినందుకే ప్రభుత్వం తీర్మానం పెట్టిందని, ఇది బీఆర్ఎస్ విజయమని హరీష్ రావు అన్నారు.

మంత్రి కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేస్తూ కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని స్పీకర్ ను కోరారు. హరీష్ రావు విజ్ఞప్తిపై కోమిటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డు నుండి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందన్నారు. ప్రాజెక్టులు అప్పజెప్పడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని ఆగం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పులను తాము సరిదిద్దుతామని తమకు సహకరించాలని కోరారు. తమకు ఎలాంటి స్వార్దం లేదని అన్నారు. మాకు మీలా జగన్ తో ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవు అని రాజగోపాల్ రెడ్డి  అన్నారు. అధికార విపక్షాల మధ్య ఈ విధంగా మాటల యుద్దం జరిగింది. మొత్తంగా కృష్ణానది మీద ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రశక్తే లేదని తెలంగాణ వాటా నీళ్లు రాష్ట్రానికి ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.

YSRCP: రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్ధులు

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju