ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన గురువారం సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి హరీష్ రావు మీడియాకు వెల్లడించారు. లక్షా 30వేల కుటుంబాలకు దళిత బంధు పథకం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. హుజూరాబాద్ మినహా 118 నియోజకవర్గాల్లో 1100 మందికి వెంటనే దళిత బంధు పథకం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇక సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. గృహ నిర్మాణ పథఖం కింద పేదలు పడిన బకాయిలను రద్దు చేయాలని నిర్ణయించింది. గృహ లక్ష్మి పథకం ద్వారా నాలుగు లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయిం తీసుకున్నారు. పేదలకు ఉపయోపడే పలు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గొర్రెల పంపిణీ పథకానికి రూ.4,463 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయిం తీసుకున్నది. కాశీలో, శబరిమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున వసతి గృహాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం రూ.50 కోట్లు కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. సూర్యాపేట మినీ ట్యాంక్ పనుల సవరించిన అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
అమరావతికై ఐక్య ఉద్యమాలు