Nani : టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా హీరో నానికి అద్భుతమైన ఇమేజ్ ఉంది. ఆయన నటించిన సినిమా హిట్ అయినా ఫ్లాపయినా అవకాశాలకి మాత్రం కొదవుండదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కమిటవుతూనే ఉంటాడు. అలా అని ఏ కథ పడితే ఆ కథ ఒప్పుకోడు. తన సినిమా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడాలనే పక్కా నిబంధనతోనే సినిమా ఎంచుకుంటాడు. ఇక ఇప్పటికే నాని హీరోగా నటించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టక్ జగదీష్ అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.
కాగా మొదటిసారి నాని భారీ బడ్జెట్ సినిమాలో నటించాడు. ఆ సినిమాను కలకత్తా నేపథ్యంలో తెరకెక్కించారు. అదే శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాను తెరకెక్కించగా, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటించారు. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలో నాని నటిస్తున్న అంటే సుందరానికి అనే సినిమాను పట్టాలెక్కించాడు. ఇందులో తమిళ, మలాయాళ హీరోయిన్ నజ్రియా హీరోయిన్ నటిస్తోంది. ఈ కథ కంప్లీట్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని సమాచారం.
Nani : నాని తెలంగాణ యువకుడిగా, తెలంగాణ యాసలో మాట్లాడనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
కాగా నాని తాజాగా మరో సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడట. అందుకోసం భాష మీద పట్టు సాధించేందుకు ఓ ట్యూటర్ ను కూడా పెట్టుకున్నట్టు ఆయన వద్ద క్లాసులు వింటున్నట్టు సమాచారం. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రికి పరిచయమవుతున్నాడు. చిత్ర కథ తెలంగాణ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. నాని తెలంగాణ యువకుడిగా, తెలంగాణ యాసలో మాట్లాడనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక నాని ఇప్పటికే పూర్తి చేసిన రెండు సినిమాలు..ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘అంటే సుందరానికి’ అనే సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ చేయనున్నారు.