KCR: ఖమ్మం లో నిర్వహించిన బీఆర్ఎస్ అవిర్భావ సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ వరాల జల్లు కురిపించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి సారిగా నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా కేసిఆర్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. ఖమ్మం బహిరంగ సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని స్పష్టం చేశారు. ఖమ్మం లోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 589 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షలు చొప్పున నిధులను ఇస్తున్నట్లు హామీ ఇచ్చిన కేసిఆర్.. పది వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.10కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తానని తెలిపారు.

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ కు రూ.50కోట్లు, ఖమ్మం మున్నేరు నది పై వంతెన నిర్మాణంతో పాటు ఖమ్మం జిల్లా కు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు హామీల వర్షం కురిపించారు సీఎం కేసిఆర్. ఖమ్మం జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ లకు నెలలోగా ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలం దొరకకపోతే సేకరించి అయినా జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కేసిఆర్ తెలిపారు. బహిరంగ సభకు అశేషంగా విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి సీఎం కేసిఆర్ తొలుత ఆత్మీయ బంధువులకు ధన్యవాదాలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విధానం, వ్యూహాలను వివరించారు.
ఒకటి కాకపోతే మరొకటి వచ్చే .. బండి సంజయ్ కుమారుడిపై కళాశాల యాజమాన్యం వేటు