24న హస్తినకు తెలంగాణ సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 24న ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై ఆయన వివిధ పార్టీల నాయకులతో చర్చిస్తారు. ముందుగా భువనేశ్వర్ వెళతారు. అక్కడ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భటీ అవుతారు.భువనేశ్వర్  నుంచి  హస్తినకు బయలు దేరి వెళతారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ఈ నెల 23న విశాఖ శారదా పీఠాన్ని సందర్శించి, పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం తీసుకుంటారు. అక్కడ నుంచి నేరుగా భువనేశ్వర్ చేరుకుంటారు.

భువనేశ్వర్ లో నవీన్ పట్నాయక్ తో భేటీ అవుతారు. ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తారు. అనంతరం ఢిల్లీ వెళతారు. ఢిల్లీలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశం అవుతారు. అవకాశాన్ని బట్టి అదే రోజు ప్రధాని నరేంద్రమోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానితో భేటీలో ఆయన విభజన చట్టంలోని హామీల అమలు గురించి చర్చిస్తారు.

SHARE