TPCC President: ధారావాహిక సీరియల్ లాగ సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎంపిక!తాజా అప్ డేట్ ఏమిటంటే??

Share

TPCC President: తెలంగాణ పిసిసి నూతన చీఫ్ నియామక వ్యవహారం ధారావాహిక సీరియల్ ను తలపిస్తోంది. ఈ విషయంలో దాదాపు ఏడాదిగా ఎడతెగని కసరత్తు సాగుతోంది.ఎప్పటికప్పుడు కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తయిందని,ఈరోజో రేపో ఆ పేరును ప్రకటిస్తారని వార్తలు రావడమే మినహా ఈ విషయంలో పురోగతి కనిపించడం లేదు.ఈ మధ్యలో అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి.కొందరు మేం రేసులో ఉన్నామంటూ ముందుకొస్తుండగా మరికొందరు ప్రముఖులు తమకు ఆ పదవి వద్దంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు.

Telangana Congress chief selection going on like a serial
Telangana Congress chief selection going on like a serial

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే కొత్త చీఫ్ ఎన్నిక ప్రక్రియ మొదలైంది.ఈ రేసులో ఇద్దరు పార్టీ ఎంపీలు ముందు వరుసలో నిలిచారు.మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి అందరికన్నా ముందుండగా నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనని క్లోజ్ గా ఫాలో అవుతున్నారు.నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కా కాంగ్రెస్ వాది.నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా చాలా దశాబ్దాలుగా ఉన్నారు.రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుండి కాంగ్రెస్ లోకి వచ్చి ఎంపీగా ఎన్నికైన నాయకుడు.అయితే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి పైనే ఎక్కువ గురి కుదిరిందని టాక్.ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే అంత దమ్మున్న నేత రేవంత్రెడ్డి మాత్రమేనని రాహుల్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు పార్టీలో ఉన్న సీనియారిటీని ఎత్తిచూపుతూ లాబియింగ్ చేసుకుంటున్నారు.మధ్యలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు,మాజీ మంత్రి జీవన్ రెడ్డి తదితరుల పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి.సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం తాను రేసులో ఉన్నారని తనకు పదవి ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తానని ప్రకటించడం జరిగింది.

వడపోత పోసిన జాబితా హైకమాండ్ కి సమర్పణ!

ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ ఐదుగురి పేర్లతో ఒక తాజా జాబితాను రూపొందించారు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్లు ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాను పార్టీ హైకమాండ్ కి ఆయన సమర్పించారని ,టెన్ జన్ పథ్ సూచనలతో వీరితో సంప్రదింపులు జరిపే ప్రక్రియ కూడా ప్రారంభమయ్యిందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ జాబితాను మరింత వడబోసి త్వరలోనే కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారని ఆ వర్గాలు చెబుతున్నా అదెప్పుడు జరుగుతుందన్నదే తేలాల్సి ఉంది.

 


Share

Related posts

Bigg boss 4: వైల్డ్ కార్డ్ ఎంట్రీగా యాంకర్ సుమ.. అబ్బో బాగానే ప్లాన్ చేశాడు బాగ్ బాస్?

Varun G

షాకింగ్ : డ్రగ్స్ కేసులో క్రికెటర్లు సూపర్ స్టార్ ల గుట్టు బయట పెట్టేసిన సంచలన నటి…!

arun kanna

ఈ హత్యలు అన్నీ జగన్ చేశారా…? ఈ లెక్కన బాబు జీవితాంతం జైల్లోనే ఉండాలేమో లోకేషా…

arun kanna