NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress Party : ఎమ్మెల్సీ ఫలితాలతో తెగ వర్రీ అవుతున్న తెలంగాణ కాంగ్రెస్!

Congress Party : హేమాహేమీలైన నేతలున్న కాంగ్రెస్​కు తెలంగాణ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్​నే ఇచ్చాయి. కనీసం ఆ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో కూడా నిలువలేకపోయారు. హైదరాబాద్​– రంగారెడ్డి– మహబూబ్​నగర్​ స్థానంలో పోటీ చేసిన చిన్నారెడ్డి నాలుగో స్థానంలో, వరంగల్​– నల్గొండ–  ఖమ్మం స్థానంలో పోటీ చేసిన రాములు నాయక్​ ఐదో స్థానంలో నిలిచారు.

‘హైదరాబాద్’​ స్థానంలో 3,57,354 ఓట్లు పోలవగా చిన్నారెడ్డికి 32,879 ఓట్లు వచ్చాయి. ‘వరంగల్’ స్థానంలో మొత్తం 3,87,969 ఓట్లు పోలవగా రాములు నాయక్​కు 27,588 ఓట్లు వచ్చాయి. ఈ పరిస్థితి చూసి కాంగ్రెస్​ నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏ నాయకుడ్ని కదిలించినా పార్టీ భవిష్యత్​పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేడర్ అయోమయంలో కూరుకుపోయింది.

Telangana Congress Party is worrying with the MLC results!
Telangana Congress Party is worrying with the MLC results!

Congress Party : ముందే అభ్యర్థులను ప్రకటించినా..

రెండు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానాలకు అన్ని పార్టీల కన్నా ముందే కాంగ్రెస్​ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. పోటీకి చాలా మంది నాయకులు ఆశపడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్కం ఠాగూర్​ హైదరాబాద్​ వచ్చి రెండు స్థానాల ఆశావహుల పరిశీలన కోసం ప్రత్యేకంగా కమిటీలు వేశారు. చాలా మంది నేతలు తమకు అవకాశం కల్పించాలని అప్లయ్​ చేసుకున్నారు.  మీటింగ్​లలో తమకే ఎందుకు అవకాశం ఇవ్వాలో చెప్పుకున్నారు. పేర్లన్నీ పరిశీలించిన కమిటీలు కాచి వడబోసి రెండు, మూడు పేర్లను హైకమాండ్​కు  పంపించాయి. చిన్నారెడ్డి, రాములు నాయక్​ను ఆయా స్థానాలకు అభ్యర్థులుగా హైకమాండ్​ ఎంపిక చేసింది.

ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్  ఎన్నికల తర్వాత పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని భావించిన పీసీసీ ఆశావహ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అగ్ర నేతలు ఎక్కడికక్కడ పోటీ పడి ప్రచారాలు చేశారు. ఉత్తమ్​, భట్టి, రేవంత్​, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిలాంటి నేతలు అభ్యర్థుల తరఫున తమ నియోజక వర్గాల్లో బాగానే ప్రచారం సాగించారు. కానీ ఫలితం రాబట్టలేకపోయారు. ‘హైదరాబాద్’ నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ అభ్యర్థి వాణీదేవి, బీజేపీ అభ్యర్థి రాంచందర్​రావు, ఇండిపెండెంట్​అభ్యర్థి నాగేశ్వర్  తర్వాతి స్థానానికి కాంగ్రెస్​ అభ్యర్థి పరిమితమయ్యారు. ‘వరంగల్’ స్థానంలో టీఆర్​ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి​, ఇండిపెండెంట్ అభ్యర్థి​ తీన్మార్​ మల్లన్న, టీజేఎస్​ అభ్యర్థి కోదండరాం, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్​రెడ్డి తర్వాతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నిలిచారు.

వలసల దిగులు

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఘోరంగా ఓడిపోయామని కాంగ్రెస్​ నేతలు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో వారిని వలసల భయం వెంటాడుతోంది. ఎందరు పక్క పార్టీల బాట పడతారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్​ పరిధిలోని నేతలు కూన శ్రీశైలంగౌడ్, కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్​కు గుడ్​ బై  చెప్పారు. కూన శ్రీశైలం గౌడ్​ బీజేపీలో చేరారు. ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీలతో టచ్​లో ఉన్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. త్వరలో జరగనున్న నాగార్జునసాగర్​ ఉప ఎన్నికలో గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఉంటుందేమోనని కాంగ్రెస్​ నేతలకు దిగులు పట్టుకుంది.

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!