TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను రిలీజ్ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా విద్యార్ధులకు కీలక సూచన చేశారు. ఫెయిల్ అయిన విద్యార్ధులు ఆందోళన చెందవద్దనీ, వారిని తల్లిదండ్రులు ఒత్తిడికి గురి చేయవద్దని సూచించారు. జూన్ 4 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఈ నెల 10 నుండి 16వ తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షలకు అప్లయ్ చేసుకోవచ్చని చెప్పారు. ఎంసెట్ రాసేవాళ్లు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ లేదు కాబట్టి విద్యార్ధులు ఈ ఫలితాలను పట్టించుకోవద్దని మంత్రి తెలిపారు.

మొత్తం 9,47, 699 మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలు రాశారు. కాగా ఈ ఫలితాల్లో బాలికలదే పై చేయి సాధించారు. ఫలితాలను http://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మొత్తం 63.85 శాతం పాసైయ్యారనీ, బాలికల ఉత్తీర్ణత 68.68 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత 54,66 శాతంగా ఉందని చెప్పారు. ద్వితీయ ఇంటర్ లో 63,49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారని తెలిపారు. బాలికల ఉత్తీర్ణత 71,57 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత 55.60 శాతంగా ఉందని చెప్పారు. అయితే ఇంటర్ ఫలితాల్లో ప్రైవేటు కళాశాలల కంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ముందంజలో ఉన్నాయన్నారు.
ప్రైవేటు జూనియర్ కళాశాలలో 63 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించగా, రెసిడెన్షియల్ కాలేజీల్లో 92 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో 80 శాతం మంది విద్యార్ధులు పాసయ్యారనీ, ఇది సంతోషించదగిన విషయమని మంత్రి పేర్కొన్నారు. అయితే గత ఏడాది కంటే పాస్ పర్సెంటేజ్ ఈ ఏడాది చాలా తగ్గింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మెడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా, మూడో స్థానంలో కొమరం భీం అసిఫాబాద్ జిల్లా నిలిచింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా ప్రధమ స్థానంలో నిలిచింది.
Visakha: అనారోగ్యంతో ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య