NewsOrbit
న్యూస్

గుడ్‌న్యూస్‌.. కోవిడ్ హోం పేషెంట్ల కోసం తెలంగాణ స‌ర్కారు త్వ‌ర‌లో కొత్త యాప్‌..

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కోవిడ్ హోం పేషెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లో వారి కోసం ఓ నూత‌న యాప్‌ను అందుబాటులోకి తేనుంది. హోం ఐసొలేష‌న్‌లో ఉండి కోవిడ్ చికిత్స తీసుకుంటున్న‌వారికి ఆ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అందులో డాక్ట‌ర్ల‌ను, పేషెంట్ల‌ను అనుసంధానం చేస్తారు. ఒక్కో డాక్ట‌ర్‌కు 50 మంది పేషెంట్ల‌ను కేటాయిస్తారు. వారు నిత్యం పేషెంట్ల‌కు కాల్స్ చేస్తూ వారి ప‌రిస్థితిని తెలుసుకోవాలి. అవ‌స‌రం అయిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంతోపాటు వారికి అవ‌స‌రం అయితే డాక్ట‌ర్లు మందుల‌ను కూడా ఇవ్వాలి.

telangana government develops new app for covid home isolation patients

ఇక ఆ యాప్‌లో పేషెంట్ల‌తో మాట్లాడేందుకు డాక్ట‌ర్ల‌కు వీడియో కాలింగ్ స‌దుపాయం కూడా ఉంటుంది. ఇందుకు గాను తెలంగాణ ప్ర‌భుత్వం రిటైర్ అయిన డాక్ట‌ర్ల‌ను నియ‌మించుకోనుంది. ఇక ఆ యాప్‌ను ఐఐటీ డెవ‌ల‌ప్ చేస్తోంది. ఆ యాప్ ద్వారా హోం ఐసొలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న కోవిడ్ పేషెంట్ల‌ను ప్ర‌భుత్వం కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించ‌వచ్చు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 10వేల మందికి పైగా పేషెంట్లు హోం ఐసొలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. వీరంద‌రి వివ‌రాల‌ను యాప్‌లో చేర్చి డాక్ట‌ర్ల‌తో అనుసంధానం చేస్తారు. ఈ క్ర‌మంలో పేషెంట్లు వైద్య స‌హాయం పొంద‌డం మ‌రింత సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది.

అయితే ఆ యాప్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది వెల్ల‌డించ‌లేదు. కానీ అతి త్వ‌ర‌లోనే యాప్‌ను ఆవిష్క‌రిస్తార‌ని తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నివార‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్నారు. తాజాగా ఆయ‌న స‌మీక్షా స‌మావేశం కూడా నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే అన్ని వైపుల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేలా ఓ ప‌కడ్బందీ ప్ర‌ణాళిక‌తో తెలంగాణ స‌ర్కారు కోవిడ్ నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగానే ఆ యాప్‌ను కూడా డెవ‌ల‌ప్ చేస్తున్నారు.

author avatar
Srikanth A

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju