NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం .. బడ్జెట్‌పై లంచ్ మోషన్ పిటిషన్ ను ఉప సంహరించుకున్న సర్కార్  

తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభిస్తామనీ, రాజ్యాంగపరంగా నిబంధనలు అన్ని నిర్వర్తిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. బడ్జెట్ సిఫార్సులకు ఇంకా గవర్నర్ ఆమోదముద్ర వేయని నేపథ్యంలో గవర్నర్ తమిళిసైకి వ్యతిరేకంగా సర్కార్ హైకోర్టులో ను ఆశ్రయించింది.

kcr tamilisai

 

లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర బడ్జెట్ ముసాయిదా ప్రతులకు ఆమోదం తెలపలేదనీ, గవర్నర్ ఆమోదం తెలపకపోతే కష్టతరమవుతుందని ఏజీ ధర్మాసనానికి వివరించగా, గవర్నర్, ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో తామెలా జోక్యం చేసుకోగలమని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తొంది. లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏజి సమాధానం ఇవ్వడంతో అందుకు ధర్మాసనం అంగీకరించింది. అయితే పిటిషన్ రెడిగా ఉందా, సిద్దంగా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విచారణ చేపడతామని ధర్మాసనం ఏజీకి స్పష్టం చేసింది.

Telangana High Court

 

ఈ తరుణంలో అడ్వొకేట్ జనరల్ ఛాంబర్ లో గవర్నర్ తరపు న్యాయవాది అశోక్ రాంపాల్, ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే, అడ్వొకేట్ జనరల్ దాదాపు గంట పాటు సమావేశమై అనేక అంశాలపై చర్చించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుండి ప్రభుత్వంపై వచ్చే విమర్శలు, అధికార పక్షం నుండి గవర్నర్ ను టార్గెట్ చేస్తూ సాగుతున్న విమర్శలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ వాతావరణం ఉండకూడదనే నిర్ణయానికి వచ్చారు. వీరి మధ్య చర్చలు సఫలం అవ్వడంతో తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత ఈ విషయాలను హైకోర్టు ధృష్టికి తీసుకువెళ్లారు. లంచ్ మోషన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు దుష్యంత్ దవే. గవర్నర్ తరపు న్యాయవాది తో తమకు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయనీ దుష్యంత్ దవే వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలియడంతో పాటు విమర్శలు, ప్రతి విమర్శలకు స్వస్తి పలకాలని నిర్ణయానికి రావడంతో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య సయోధ్య కుదిరినట్లు అయ్యింది.

గవర్నర్ వర్సెస్ సర్కార్ ..తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ..  హైకోర్టును ఆశ్రయిస్తున్న సర్కార్..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju