21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
తెలంగాణ‌ న్యూస్

Jobs: నిరుద్యోగులకు కేసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్

Share

తెలంగాణలో నిరుద్యోగులకు కేసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రుప్ 4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 9,168 గ్రూపు 4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

TSPSC

వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా 9,168 పోస్టుల ను భర్తీ చేయడానికి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. టీఎస్ పీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ చేయనున్నది. త్వరలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 9,168 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఉద్యోగ అభ్యర్ధులందరికీ ఈ సందర్భంగా మంత్రి హరీష్ రవు శుభాకాంక్షలు తెలిపారు.

గ్రూపు – 4 ఉద్యోగాల్లో మూడు కేటగిరిలకు సంబంధించి పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, పంచాయతీరాజ్ శాఖలో 1,245 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 2,077 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ బీజేపీ కీలక నేతకు హైకోర్టులో బిగ్ రిలీఫ్


Share

Related posts

బ్రేకింగ్: విశాఖలో మరో విషాదం.. గ్యాస్ లీకై ఇద్దరు మృతి

Muraliak

నెతన్యాహు రికార్డు!

Kamesh

వైసీపీ కొంప ముంచుతున్నపేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం..!!

sekhar