YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అవినాష్ రెడ్డి తరపున సీనియర్ కౌన్సిల్ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ముందస్తు బెయిల్ పై ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ జరిపి ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది.
అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో కర్నూలులో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అయన అక్కడే ఉన్నారు. ఈ కారణంగా సీబీఐ విచారణకు రెండు పర్యాయాలు సీబీఐ నోటీసులు జారీ చేసినా విచారణకు హజరు కాలేదు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి తన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు వెకేషన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
CM YS Jagan: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్