NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. రూ.3లక్షల సొంత పూచికత్తుతో పాటు రెండు షూరిటీలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి సోమవారం నిందితులు సిట్ అధికారి ఎదుట విచారణకు హజరు కావాలని, పాస్ పోర్టులను దర్యాప్తు అధికారి వద్ద డిపాజిట్ చేయాలని ధర్మాసనం షరతులు విధించింది.

TRS MLAs poaching case

నిందితుల బెయిల్ పిటిషన్ ఇవేళ హైకోర్టులో వాదనలు జరిగాయి. నిందితులు నెల రోజుల పాటు జైల్లో ఉన్నారని, సుప్రీం కోర్టు సైతం బెయిల్ ఇవ్వొచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని వారి తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. 41 ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండా నిందితులను అరెస్టు చేయడాన్ని సుప్రీం కోర్టు సైతం తప్పుపట్టినట్లు నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మరో పక్క నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేయడంతో పాటు సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పోలీసులు తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సిట్ దర్యాప్తు కీలకదశలో ఉందనీ, ఈ తరుణంలో బెయిల్ మంజూరు చేయవద్దని ధర్మాసనాన్ని కోరారు. అయితే నిందితుల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.

Telangana High Court

 

అయితే ఈ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు అయినప్పటికీ సింహయాజీ మినహా ఇతర నిందితులు రామచంద్రభారతి, నంద కుమార్ లపై వేరు వేరు కేసులు ఉండటంతో వారి విడుదల ఇప్పట్లో కుదరకపోవచ్చు. నందకుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయిదు కేసులు నమోదు అయ్యాయి. దక్కన్ కిచెన్ లీజ్ వివాదానికి సంబంధించి వేరువేరుగా అయిదు కేసులు నమోదు కాగా లీజ్ కేసు విషయంలో పోలీసులు నందకుమార్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులోనూ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో కూడా బెయిల్ మంజూరు అయితే ఆయన జైలు నుండి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక రామచంద్రభారతి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెెండు కేసులు నమోదు అయ్యాయి. నకిలీ పాస్ పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు కల్గి ఉన్నారని రెండు వేరువేరు కేసులు నమోదు చేశారు. రామచంద్రభారతి బెయిల్ పై బయటకు రాగానే బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చూపే అవకాశం ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju