NewsOrbit
న్యూస్

మార్గదర్శి కేసులో రామోజీకి బిగ్ రిలీఫ్ .. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారం కేసులో చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ లకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపిలో ఇటీవల మార్గదర్శి చిట్ ఫండ్స్ కు చెందిన అనేక బ్రాంచీలలో ఏపీ సీఐడీ సోదాలు జరిపింది. పలువురు మేనేజర్ లను అరెస్టు చేసింది. బ్రాంచ్ లలో పలు రికార్డులను సీజ్ చేసింది. దీనిపై రామోజీరావు, శైలజా కిరణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Telangana High Court

 

ఇవేళ విచారణ సందర్భంలో మార్గదర్శి తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించారు. తమ క్లయింట్ పై వేధింపుల్లో భాగంగానే ఈ సోదాలు జరిగాయని కోర్టుకు తెలిపారు. చిట్ ఫండ్ నిధులను ఇతర మ్యూచువల్ ఫండ్లకు బదిలీ చేశారన్న అబియోగాలపై హైకోర్టు ధర్మాసనం స్పందించింది. నిధులను ఈ విధంగా మళ్లిస్తే దాన్ని నిధులు దుర్వినియోగం అనలేమని స్పష్టం చేసింది. ఖాతాదారులను మోసం చేశారని భావించలేమని తెలిపింది. మార్గదర్శి ఖాతాదారులు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమించడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

 

ఏపిలో మార్గదర్శి చిట్ ఫండ్స్ పై ఖాతాదారులను ఎటువంటి ఫిర్యాదులు అధికార యంత్రాంగానికి అందలేదు. అయితే మార్గదర్శిల చిట్ ఫండ్ లో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న అభియోగంపై రాష్ట్రంలో మార్గదర్శికి 37 శాఖలు ఉండగా 17 శాఖల్లో తనిఖీలు నిర్వహించారు. ఆడిటర్ నివేదిక ఆధారంగా ఉల్లంఘనలపై నిర్ధారణకు వచ్చారు. చిట్స్ వ్యాపారం నిర్వహిస్తున్న ఏడు చోట్ల నుండి అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. అడిటర్ నివేదిక ప్రకారం ఆర్ధిక ఉల్లంఘనలు జరిగినట్లుగా గుర్తించి కేసులు మోదు చేశారమనీ, విశాఖ, రాజమండ్రి, గుంటూరు ఫోర్ మెన్ ఆఫ్ చిట్స్ ను విచారించి అరెస్టు చేశామని గత వారం ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాకు తెలిపారు. మార్గదర్శి చిట్స్ ఇలాగే నిబంధనల ఉల్లంఘనలకు కొనసాగించి, మతో సహకరించకుంటే రాష్ట్రంలో ఆ సంస్థను మూసివేయించేందుకు ఏ మాత్రం వెనుకాడబోమని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐడీ వీ రామకృష్ణ గత వారం హెచ్చరించారు. ఈ తరుణంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇది

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju