NewsOrbit
న్యూస్

TS High Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు బిగ్ షాక్ ..కోదండరాం, అమీరుల్లా ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్

TS High Court: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లా ఖాన్ లు ఇటీవల ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ  హైకోర్టులో సవాల్ చేశారు.

గతంలో తాము వేసిన పిటిషన్ పై విచారణ తేలే వరకూ ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై మంగళవారం (ఈరోజు) హైకోర్టులో విచారణకు రాగా, యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. కాని ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించారు దీనిని సవాల్ చేస్తూ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది జూలై లో వీరిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ నాడు సీఎం కేసిఆర్ నేతృత్వంలో కేబినెట్ తీర్మానం చేసింది.

కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత ఏడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. కేబినెట్ కు ఎమ్మెల్సీలను నామినేటెడ్ చేసే హక్కు ఉంటుందని, గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారంటూ శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ హైకోర్టు విచారణ దశలో ఉంది. ఆ తర్వాత రేవంత్ నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరగా, ఇటీవల ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లా ఖాన్ లను నామినేట్ చేసింది. ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపారు.

Video Viral: చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ సీనియర్ నేత  .. ఆలపాటి రాజా టంగ్ స్లిప్ .. సీఎం జగన్ కు ప్రశంసలు ..వీడియో వైరల్

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N