NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana: వైఎస్సార్ ను టార్గెట్ చేసిన తెలంగాణ మంత్రి!పీజేఆర్ మరణానికి బాధ్యుడని సంచలన ఆరోపణ!

Telangana: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో తెలంగాణ కొత్త కొత్త ఆరోపణలు చేస్తోంది.తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్ ఇదే పనిలో ఉన్నారు.మూడు రోజుల నుండి శ్రీనివాసగౌడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారు.ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.వ్యక్తిగత ఆరోపణలు సైతం చేస్తున్నారు.ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లి శ్రీనివాసగౌడ్ దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర అభియోగం మోపారు.ఇది రాజకీయంగా వివాదస్పదమయ్యే సూచనలు గోచరిస్తున్నాయి.

Telangana Minister Targeted YSR
Telangana Minister Targeted YSR

పీజేఆర్ మరణానికి వైఎస్సార్ బాధ్యుడట!

తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజం, సీఎల్పీ మాజీ నాయకుడు పి జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించడం జరిగింది.అయితే ఆయనకు గుండెనొప్పి వచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లేనని ఇప్పుడు శ్రీనివాసగౌడ్ వెల్లడించారు.ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఆంధ్రప్రదేశ్ అధిక వాటా జలాలు తీసుకోవడాన్ని పిజెఆర్ వ్యతిరేకించగా వైఎస్సార్ ఆయనను తీవ్రంగా మందలించి అవమానించారని చెప్పారు.దీంతో పీజేఆర్ కి గుండెనొప్పి వచ్చిందన్నారు.అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి అంబులెన్స్ లో ఉన్న డాక్టర్లు కూడా పిజెఆర్ కి ప్రాధమిక చికిత్స అందించకపోవడంతో సకాలంలో వైద్య సహాయం అందక ఆయన మరణించారని చెప్పారు.ఆ వైద్యులు గనుక చికిత్స చేసి ఉంటే జనార్దన్ రెడ్డి బతికేవారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

మంత్రి ఇంకా ఏం చెప్పారంటే!

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన మావోయిస్టు నేతల్ని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చర్చలకు పిలిపించి చంపించేశారని కూడా మంత్రి ఆరోపించారు.అసలు రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారని మంత్రి అన్నారు.వైఎస్సార్ పాలనలోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు.తెలంగాణ జలాలు, నిధులు, ఉద్యోగాలను కూడా వైఎస్సార్ మళ్ళించారని ఆయన పేర్కొన్నారు.ఇప్పుడు వైఎస్సార్ కుమారుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తూ తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ కి దౌర్జన్యపూరితంగా మళ్లించుకుంటున్నారని ఆయన చెప్పారు.కేంద్రం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

 

author avatar
Yandamuri

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju