NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

 

(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

తెలంగాణ శాసనసభ నేడు నాలుగు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. స్టాంపుల రిజిస్ట్రేషన్ చట్టాలకు సంబంధించిన బిల్లు, అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసి చట్ట సవరణ బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ సవరణ బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ చట్టానికి అయిదు సవరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ, పది శాతం బడ్జెట్‌ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండవ చట్ట సవరణ, అధికారుల్లో, ప్రజా ప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ మూడవ చట్ట సవరణ, జీహెచ్ఎంసీ రిజర్వేషన్ రెండు పర్యాయాలు కొనసాగిస్తూ నాల్గవ చట్ట సవరణ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేలా అయిదవ చట్ట సవరణ చేస్తున్నట్లు కేటిఆర్ ప్రకటించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 33శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్గ డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న కారణంగా వారికి సమాన ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బిల్లులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు  స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కేవలం చట్ట సవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.

ఇదిలా ఉండగా మరో వైపు తెలంగాణ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన చట్టాలను వ్యతిరేకిస్తూ బిజెపి నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు బీజెపి నేతలను అరెస్టు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలను చేసిందని బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

author avatar
Special Bureau

Related posts

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?