ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలపై తెలంగాణ పోలీసు నియామక బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో మల్టిపుల్ ప్రశ్న విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉత్తీర్ణులైన వారికి దేహదారుడ్య పరీశ్రలు నిర్వహించనున్నారు. ఇందు కోసం అప్పుడు ఉన్న హాల్ టికెట్ నంబర్లతో అభ్యర్ధులు లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 30వ తేదీ నుండి వెబ్ సైట్ లో లాగిన్ అయి దేహదారుడ్య పరీక్ష కోసం పార్టు – 2 అప్లికేషన్ సబ్మిట్ చేయాలని పోలీస్ నియామక బోర్డు తెలిపింది. ప్రస్తుతం ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై ఇప్పటికే దేహదారుడ్య పరీక్ష పూర్తి చేసిన వారికి అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే దేహదారుడ్య పరీక్షలో ఉత్తీర్ణులు కాని వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోలీసు నియామక బోర్డు చెప్పింది.

కోర్టు ఆదేశాల ప్రకారం ప్రిలిమినరీ ఎక్సామ్స్ పాసైన వారు ఫిబ్రవరి 1న ఉదయం 8 గంటల నుండి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకూ దేహదారుడ్య పరీక్షల హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 15 నుండి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షల కోసం హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్లు, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లొండ, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని మైదానాల్లో పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు పోలీస్ నియామక బోర్డు కసరత్తు చేస్తొంది.
ప్రిలిమినరీ పరీక్షలో సిలబస్ లేని ఏడు ప్రశ్నల వల్ల మైనస్ మార్కులతో పలువురు అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో తమకు అన్యాయం జరిగిందని అభ్యర్ధులు హైకోర్టు ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాలతో పోలీస్ నియామక మండలి ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.
శ్రీశైలం మల్లన్నే కాపాడాడు.. ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం..