Samantha : సమంత కోసం తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్..!

Share

Samantha : సమంత అక్కినేని సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటిపోయింది. దాంతో ఆమె అభిమానులే కాకుండా ప్రేక్షకులు తన సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మజిలీ, ఓ బేబీ లాంటి సూపర్ హిట్స్ అందుకున్న సమంత హ్యాట్రిక్ హిట్ కొట్టాలని తమిళ సూపర్ హిట్ సినిమా 96 లో నటించింది. తమిళంలో త్రిషకి ఈ సినిమా మంచి కం బ్యాక్ మూవీగా నిలిచింది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ కల్ట్ లవ్ స్టోరీ తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో సమంత కూడా ఈ సినిమా తెలుగు రీమేక్ మీద ఆసక్తి చూపించి సైన్ చేసింది. యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో కొత్త ప్రాజెక్ట్ వెంటనే కమిటవలేదు.

telugu audience are waiting for samantha....!
telugu audience are waiting for samantha….!

కాస్త గ్యాప్ తీసుకొని సూపర్ హిట్ సిరీస్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించింది. రాజ్ అండ్ డీకే దీనిని రూపొందించారు. ముందు నుంచి సమంత ఈ వెబ్ సిరీస్ లో నటిస్తుండటం, బాలీవుడ్ లో డెబ్యూ చేయడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజైందో వివాదాలు చుట్టుముట్టాయి. రిలీజ్ చేయకూడదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా అనుకున్న సమయానికి ది ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజ్ చేశారు. అయితే కేవలం హిందీలో మాత్రమే డిజిటల్ రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్ రావడం తో పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇది చూసిన వాళ్ళు సమంతను ప్రశంసిస్తున్నారు.

Samantha : సమంత ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చేస్తోంది.

కానీ తెలుగు, తమిళ భాషలలో ది ఫ్యామిలీ మ్యాన్ రిలీజ్ కాకపోవడం కాస్త అభిమానులను నిరాశపరుస్తోంది. సమంత తమిళ అమ్మాయి..తమిళ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కి వచ్చి ఇక్కడ క్రేజ్ సంపాదించుకుంది. దాంతో ఇటు తెలుగు ప్రేక్షకులు, అటు తమిళ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.కానీ ఇంకా మేకర్స్ నుంచి తెలుగు, తమిళం తో
పాటు మిగతా భాషలలో దీనిని ఎప్పుడు రిలీజ్ చేస్తారనది క్లారిటీ రావడం లేదు. ఇక సమంత ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియన్ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. అన్నీ సౌత్ భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.


Share

Related posts

జనవరి నుండి వాహనాల ధరలు పెరుగుతూన్నాయి..! మహీంద్రా ఎంత పెంచిందో తెలుసా..!?

bharani jella

లేడీ మల్టీ స్టారర్ లో సమంత, రష్మిక ..?

GRK

బోల్డ్‌ మూవీలో మ‌హేష్ హీరోయిన్‌

Siva Prasad