బిగ్ బాస్ ద్వారా విపరీతంగా ఫేమస్ అయిపోయిన సోహెల్ ‘కొత్త బంగారులోకం’ సినిమా తోనే నటుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక కొన్ని సినిమాల్లో మంచి మంచి పాత్రలు కూడా పోషించాడు. అయితే బుల్లితెర లో ఎంట్రీ ఇచ్చి కొన్ని సీరియల్స్ లో నటించాడు. ఇప్పుడు బిగ్బాస్ ఇంటినుండి బయటికి వచ్చిన తర్వాత అతనిని ఆఫర్లు చుట్టుముడుతున్నాయి. ఇదే క్రమంలో సోహెల్ మరొక మేటర్ లీక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం…
ప్రస్తుతం బాలీవుడ్ లోకి సోహెల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అతని పాపులారిటీ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అతనే. ఈ క్రమంలో అతనికి వస్తున్న ఆఫర్లపై కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తను హీరోగా షూటింగ్ మొదలు కాబోయే సినిమా ప్రకటించిన సోహెల్ మరి కొన్ని ప్రాజెక్టులను వరుసగా లైన్ లో పెట్టుకున్నాడు. ఇక ‘ది రోజ్ విల్లా అనే ఒక మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సోహెల్ గెస్ట్ గా వచ్చాడు.
ఈ సందర్భంగా నిర్మాత రామారావు గురించి మాట్లాడుతూ… నేను బిగ్ బాస్ కు రాకముందు రామారావు అన్న నాకు చాలా హెల్ప్ చేశారు ఈ క్రమంలోనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ ఇప్పించారు ఇప్పుడు ఇది చేస్తున్నాను…. అని అఫీషియల్ ప్రకటన కు ముందే లీక్ చేసేశాడు సోహెల్. తెలుగు బిగ్ బాస్ నుండి బాలీవుడ్ వరకు వెళ్ళిన మొదటి కంటెస్టెంట్ గా సోహెల్ రికార్డులకెక్కాడు.