NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Telugu Desam Party: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం..! రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు వాళ్లకే..

Telugu Desam Party: టీడీపీ 40 వసంతాల వేడుకల సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం టీడీపీ 40వ వసంతాల వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. ఏపి మంగళగిరి పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగ్గా, హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగా జరిగిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంల సీనియర్ నేతలకు షాకింగ్ న్యూస్ చెప్పారు. పార్టీలో యువతను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున 40 శాతం సీట్లను యువతకే కేటాయించనున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం యువత ముందుకు వచ్చి పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Telugu Desam Party chief Chandrababu Key announcement
Telugu Desam Party chief Chandrababu Key announcement

Telugu Desam Party: గాడ్ ఫాదర్ లేడని భయపడాల్సిన అవసరం లేదు

రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేడని భయపడాల్సిన అవసరం లేదన్నారు. సమాజ హితం, రాజకీయాల్లో మార్పు తేవాలనుకుంటున్న వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువత ముందుకు వచ్చి న్యాయం కోసం పోరాడాలన్నారు. సంపదను సృష్టించడంలో టీడీపీ ముందుందని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యువతకు సీట్లు కేటాయించిన నియోజకవర్గాల్లో సీనియర్ల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందన్నారు.

నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావం, టీడీపీ చరిత్ర, టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చంద్రబాబు వివరించారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 40 దేశాలలో 200 నగరాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఒక రాజకీయ పార్టీ 41 సంవత్సరంలోకి అడుగుపెట్టడం అరుదైన అవకాశమని చంద్రబాబు అన్నారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, కిమిడి కళావెంకట్రావు తదితరులు ప్రసంగించారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?