Tollywood Directors: టాలీవుడ్ పరిశ్రమలో చాలా ఏళ్ళ క్రితం ఒక డైరెక్టర్ వరుసగా సినిమాలు చేశాడు. ఎన్నో సినిమాలు చేస్తే ఒకటో రెండో హిట్ అయ్యాయి. మిగిలినవన్నీ అతనికి ఫ్లాపులే మిగిల్చాయి. ఇటీవల కాలంలో ఒక సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఏదో అదృష్టం కొద్ది ఆ ఒక్క సినిమాతో హిట్ కొట్టగానే సదరు డైరెక్టర్ భూమ్మీద ఆగడం లేదు. అతడు చేస్తున్న హడావిడి బహుశా ఏ స్టార్ డైరెక్టర్లు కూడా చేయలేరేమో అనిపిస్తోంది. ఇంకో సినిమా చేయబోతున్నానని.. ఈసారి అంతర్జాతీయ లెవల్లో హిట్ కొడతానని ఆయన పలుకుతున్న డాంబికాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తానేదో పెద్ద మోడల్ అన్నట్టు భంగిమ వన్.. భంగిమ టూ అంటూ ఫొటోలు వదులుతూ సంచలనం సృష్టిస్తున్నాడు.
Chiranjeevi: చిరంజీవి కోసం బాలీవుడ్ టాప్ హీరో తీసుకురావడానికి చరణ్ ప్రత్యేక శ్రద్ధ..??
ఇది చాలదన్నట్టు తన పుట్టిన రోజు శుభాకాంక్షలు తనకు తానే తెలుపుకున్నాడు. ప్రచారానికి పరాకాష్ట అన్నట్లు వేరే వాళ్ల పేర్లతో గూగుల్ యాడ్స్ ద్వారా తనకు తానే హైప్ పెంచుకున్నాడు. అయితే ఈ ప్రచారానికి ఏకంగా 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం నిర్మాత జేబు నుంచి కాజేశారా లేక సొంతంగా పెట్టుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
Taliban: అమెరికా ప్రెసిడెంట్ ఏంటి తాలిబన్లని అంత మాట అనేశాడు !!
సొంత పబ్లిసిటీపై పెట్టిన శ్రద్ధ లో కొంచెం శ్రద్ధ సినిమాలపై పెట్టినా.. సినిమాలు కనీసం యావరేజ్ హిట్ అయిన అవుతాయని ఇండస్ట్రీలో చాలా మంది అభిప్రాయపడుతున్నారట. సినిమాలు హిట్టయితే పబ్లిసిటీ దానంతట అదే వస్తుంది కదా.. మరి అలాంటప్పుడు ఈ దర్శకుడు కేవలం పబ్లిసిటీ మీదే దృష్టిపెట్టడం ఏంటో అని ఇండస్ట్రీ వర్గాల్లో పలువురు మాట్లాడుకుంటున్నారు. కానీ పబ్లిసిటీ పిచ్చి పట్టిన సదరు దర్శకుడు.. ఒక్కసారి కమిటయితే నా మాట నేనే వినను.. అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నాడు.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ మొత్తం ఆస్తి ఎంతో తెలుసా – పెద్ద పెద్ద హీరో లు కూడా పనికిరారు
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!