Telugu Heroines: ఈ హీరోయిన్లను అస్సలు గుర్తుపట్టలేం..! తెలుగు క్యూట్ హీరోయిన్ల డీ గ్లామర్ రోల్స్ ఇవే..!

Share

Telugu Heroines: ఒక సినిమా సూపర్ హిట్ కావాలంటే ఆ సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం.. హీరోయిన్, గ్లామర్ ఇవి రెండు పర్యాయపదాలు.. గ్లామర్ ఉంటేనే హీరోయిన్గా అవకాశాలు వస్తాయనేది జగమెరిగిన సత్యం.. కానీ ఇటీవల ఇలాంటి స్టీరియో టైపిక్ విషయాల్ని కొట్టిపారేస్తున్నారు మన హీరోయిన్లు.. తమకు నచ్చినట్టుగా ఉండడమే కాకుండా.. డీగ్లామర్ పాత్రలో నటించడానికి కూడా సై అంటున్నారు.. డి గ్లామర్ రోల్స్ చేసి హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.. అలా డిగ్లామర్ రోల్స్ చేసి మెప్పించిన టాప్ హీరోయిన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..!!

Telugu Heroines: acting in De Glamour Roles
Telugu Heroines: acting in De Glamour Roles

1. ఐశ్వర్య రాజేష్ :

కౌసల్య కృష్ణమూర్తి , వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాల్లో డి గ్లామర్ రోల్స్ లో నటించి మెప్పించింది ఐశ్వర్య రాజేష్.. ఐశ్వర్య దివంగత నటుడు రాజేష్ తనయ.. తెలుగులో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన నటి శ్రీలక్ష్మి కి సొంత మేనకోడలు. అయితే ఐశ్వర్య రాజేష్ చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోవడంతో కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుంది. చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రస్తుతం మంచి నటిగా పేరు సంపాదించుకుంది. అందువల్లనే తను పోషించిన ప్రతి పాత్ర లో జీవం ఉంటుంది. తన కళ్ళల్లో ఏదో సాధించాలనే తపన ఉంటుంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన పూర్తి మాస్ పాత్రలో నటించి తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకుంది..

Telugu Heroines: acting in De Glamour Roles
Telugu Heroines: acting in De Glamour Roles

2. ప్రియమణి :

ప్రియమణి నటన గురించి చి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రియమణి నటించిన మొదటి సినిమాకి ఫిలింఫేర్ అవార్డు గెలుచుకుంది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన విలన్ సినిమాలో విక్రమ్ చెల్లెలిగా మేకప్ లేకుండానే పూర్తిస్థాయిలో డి గ్లామర్ రోల్ లో నటించి అందరినీ మెప్పించింది.

Telugu Heroines: acting in De Glamour Roles
Telugu Heroines: acting in De Glamour Roles

3. సమంత :

తెలుగు సినిమా టాప్ హీరోయిన్ లలో సమంత ఒకరు.. ఈమె అందం, అభినయానికి అభిమానులు ఫిదా.. రంగస్థలం సినిమా లో ప్రతి పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది అందులో రామ్ లక్ష్మి గా నటించిన సమంత గ్లామర్ రోల్స్ లోనే కాదు డిగ్లామర్ రోల్స్ కూడా చేయగలనని నిరూపించుకుంది. సమంత కెరీర్లో రామలక్ష్మి పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది.

Telugu Heroines: acting in De Glamour Roles
Telugu Heroines: acting in De Glamour Roles

4. అనుష్క :

ప్రయోగాలకు పెట్టింది పేరు అనుష్క.. ఎలాంటి పాత్రనైనా సునాయాసంగా చేయడమే కాదు.. సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే అందవిహీనంగా తయారవడానికైనా సిద్ధపడుతుంది.. ఇందుకు నిదర్శనం బాహుబలి సినిమాలో అమ్మ పాత్ర.. అలాగే సైజ్ జీరో సినిమా లో లావుగా ఉండే అమ్మాయి పాత్ర. ఈ సినిమా కోసం 20 కేజీల వరకు బరువు కూడా పెరిగింది. బాహుబలి సినిమాలో గ్లామర్ గా చూసిన అనుష్క ను ముందు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయనప్పటికీ తన నటనతో అందరిని కట్టిపడేసింది దేవసేన.

Telugu Heroines: acting in De Glamour Roles
Telugu Heroines: acting in De Glamour Roles

5. తమన్నా :

మిల్క్ బ్యూటీ తమన్నా అభినేత్రి బాహుబలి 2 సినిమా లో డిగ్లామర్ రోల్స్ లో నటించింది. బాహుబలి లో ఒక రెండు పాటలు తప్ప సినిమా అంతా డీగ్లామర్ లోనే కనిపించింది. అభినేత్రి సినిమాలో పల్లెటూరి భార్యగా, గ్లామర్ డాల్ గా ద్విపాత్రాభినయం చేసిన తమన్నా.. రెండు పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించింది. ఎందుకంటే ప్రేమంట చిత్రంలో కూడా తమన్నా ద్విపాత్రాభినయం చేసి ఒక పాత్రలో పల్లెటూరి అమ్మాయి గా డి గ్లామర్ రోల్ చేసి మెప్పించింది.

Telugu Heroines: acting in De Glamour Roles
Telugu Heroines: acting in De Glamour Roles

6. అమలాపాల్ :

తమిళ బ్యూటీ అమలాపాల్ కూడా తన మొదటి సినిమా ప్రేమ ఖైదీ లో డి గ్లామర్ రోల్ పోషించింది. ఆ సినిమా మొత్తం జిడ్డు ముఖం కనిపించడం కోసం అమలాపాల్ కి మేకప్ లేకుండా ఆయిల్ రాశారని టాక్.

Telugu Heroines: acting in De Glamour Roles
Telugu Heroines: acting in De Glamour Roles

7. సంజనా :

బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లి పాత్ర లో మనకి బాగా పరిచయమున్న సంజన కూడా డి గ్లామర్ రోల్ పోషించింది. దండుపాళ్యం2 సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా నటించి అందరినీ షాక్ కి గురి చేసింది. ఇదే సినిమాలో న్యూడ్ గా నటించిందని వార్తలు కూడా అప్పటి సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

Telugu Heroines: acting in De Glamour Roles
Telugu Heroines: acting in De Glamour Roles

8. రాధిక ఆప్టే :

రక్త చరిత్ర సినిమాలో పరిటాల రవి భార్య పాత్రలో అదిరిపోయే నటన కనబరిచిన రాధిక ఆప్టే కూడా ఈ సినిమాలో సాధారణ గృహిణిగా అసలు మేకప్ లేకుండా నటించింది. లేటుగా స్టార్ట్ చేసిన బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అంటూ వివిధ భాషల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది రాధిక ఆప్టే..

Telugu Heroines: acting in De Glamour Roles
Telugu Heroines: acting in De Glamour Roles

9. అమ్రితా అయ్యర్ :

బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది అమ్రితా అయ్యర్. ఈ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయి గా కనిపించి ఎటువంటి మేకప్ లేకుండా చాలా సాధారణమైన ఒదిగి పోయింది. ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలిసిన సంగతే.

Telugu Heroines: acting in De Glamour Roles
Telugu Heroines: acting in De Glamour Roles

10. రితికా :

విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమాలో బాక్సర్ గా పరిచయమైన నటి రితికా. ఈ సినిమాలో ఒక సాధారణ చేపలు అమ్మే అమ్మాయి గా, బాక్సర్ లాగా డి గ్లామర్ రోల్స్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది.

Share

Related posts

వ్యాపారాభివృధి కలగాలన్న, ఆర్ధిక సమస్యలు పోవాలన్నా ఇలా చేసిచూడండి!!

Kumar

Anupama Parameswaran Saree images

Gallery Desk

జగన్ అడ్డా లో జగన్ మీద ముసలం పుట్టింది ? కారణం ఇదే ? 

sridhar