ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయని, అయితే వర్కౌట్స్ కారణంగా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని భావించానని చెప్పింది.
ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా కరోనా టెస్టులు చేయించానని, ఫలితం పాజిటివ్ వచ్చిందని చెప్పింది. తనకు పెద్దగా కరోనా లక్షణాలు లేవని, కాబట్టి లక్షణాలు ఉంటేనే కరోనా అనుకోవద్దని వారించింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నట్లు తెలిపింది. తిరిగి త్వరలోనే కోలుకుంటానన్న ఆశాభావం వ్యక్తం చేసింది స్మిత. కరోనాను జయించేందుకు ఎదురుచూస్తున్నా. నెగటివ్ వచ్చిన తర్వాత ప్లాస్మా దానం చేస్తానని స్మిత ప్రకటించింది. తనతో పాటు తన భర్తకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందట. ప్రస్తుతం ఇద్దరూ హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!