అమెరికాలో ముగ్గురు విద్యార్ధులు మృతి

అమెరికా:  అమెరికాలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. కొలిర్‌విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి నలుగురు మృతిచెందారు.  మృతులు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గుర్రపుతండా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ నాయక్‌, సుజాత నాయక్‌ కుమార్తెలు సాత్విక నాయక్ (16), జ్వాయి నాయక్‌ (13), కుమారుడు సుహాస్ నాయక్ (14)గా ఉన్నారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు వీరు అమెరికా వెళ్లినట్లు సమాచారం. చిన్నవయసులోనే దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది.