తాత్కాలికంగా అయప్ప ఆలయం మూసివేత

శబరిమల, జనవరి 2: శబరిమలలో అయప్ప స్వామిని ఇద్దరు మహిళలు దర్శించుకున్న నేపధ్యంలో బుధవారం ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసిన అనంతరం తంత్రి ఆలయాన్ని సంప్రోక్షించి శుద్ధి చేసే కార్య్రకమాన్ని చేపట్టారు.

కేరళ సీఎం విజయన్ మహిళల ప్రవేశాన్ని ధృవీకరించారు. అయప్ప దర్శనం చేసుకునేందుకు వచ్చే మహిళలకు మరింత భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.