పది లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్, డిసెంబర్ 31: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న డ్రగ్స్ మాఫియా సభ్యులను సోమవారం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో తమ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవాలని ప్రయత్నిస్తున్న డ్రగ్స్ మాఫియాపై నిఘా పెట్టిన పోలీసులు సోమవారం ఉదయం ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్స్ డీలర్‌లను అరెస్టు చేసి వారి నుండి పది లక్షలు విలువ చేసే 89 గ్రాముల కొకైన్, సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరు నగరంలో డ్రగ్స్ అమ్మేవారికి నిషేధిత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాలు సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు.