Ten Years of Gangs of Wasseypur: అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్.. ఈ సినిమాను రెండు భాగాలుగా తీశారు. ఈ సినిమా వచ్చి పది సంవత్సరాలు అయినా కూడా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ విడుదల 10 సంవత్సరాలు అయిన సందర్భంగా మరోసారి ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.. అయితే గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా కు ఎందుకు అంత ప్రజాదరణ దక్కింది.. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి.!? ఇప్పటికి ఈ సినిమా ఎందుకు చూడాలో ఇప్డు తెలుసుకుందాం.. బ్రతికేందుకు పోరాటం, పోరాటంలో గెలిచిన వారి బ్రతికేందుకు అర్హులు అనే స్టోరీ లైన్ మీద తెరకెక్కిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్.. ఈ రెండు తీరీలను ఆధారంగా చేసుకుని పవర్, పాలిటిక్స్, రివెంజ్, వైలెన్స్ అనే కలర్స్ ను డ్రామా తో సింక్ చేస్తూ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నారెట్ చేసిన కథ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్.. ఈ సినిమా కథ ఏంటి.!? నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ ఎందుకు చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ..
వాసేపూర్ ప్రస్తుత జార్ఖండ్ స్టేట్ లో ధన్ బాగ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అత్యంత కోల్ మైన్స్ కలిగి ఉన్న ప్రాంతమే వాసేపూర్.. ఇక్కడ ఉన్న గ్యాంగ్స్ వాసపూర్ పై ఆధిపత్యం పై పోరు జరుగుతూనే ఉంటుంది. ఆ పోరే గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ కథ.. ఈ సినిమా కథ మూడు కుటుంబాల మధ్య జరుగుతుంది. ఖురేషియన్స్ ఫ్యామిలీ, ఖాన్స్ ఫ్యామిలీ, హిందూస్ ఫ్యామిలీ అయిన దేవ్స్ ఫ్యామిలీ.. ఈ కుటుంబాలలోని మూడు తరాలు స్వాతంత్రానికి ముందు ఆ తరువాత జరుగుతుంది. మూడు తరాలలోనూ ఒక్క విషయంపై పోరాటం జరుగుతూ ఉంటుంది. ముందు బొగ్గు ఆ తర్వాత ఐరన్ కోసం ఆ తరువాత ఇంటర్నెట్ ఉద్యమం జరుగుతుంది . ఈ కథ మొత్తం నరేషన్ లో జరుగుతూ ఉంటుంది. ఖాన్ కుటుంబానికి చెందిన నజీర్ ఈ కథ చెబుతూ ఉంటారు.

ఈ కథలో ఒక్కో జనరేషన్లో ఒక్కో హీరో కథను నడిపిస్తూ ఉంటారు.. షాహిద్ ఖాన్, సర్దార్ ఖాన్ , ఫైజల్ ఖాన్.. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా కథ వీరి ముగ్గురి కథలా ఉంటుంది. మొదటి కథ అంటే స్వాతంత్రానికి ముందు కోల్ మైన్స్ బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉంటాయి వారికి సపోర్ట్ చేస్తూ.. ఖురేషియన్స్ ఫ్యామిలీ రూల్ చేస్తూ ఉంటుంది. వారిని ఎదిరించి కాన్ కుటుంబం నుంచి ఒక హీరో బయటకు వస్తారు అతనే షాహిద్ ఖాన్.. ఇద్దరి వర్గాల మధ్య జరిగిన పోరులో షాహిద్ ఖాన్ మరణిస్తాడు. దాంతో అధీనం మొత్తం దేవ్స్ ఫ్యామిలీ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది. షాహిద్ ఖాన్ కొడుకే సర్దార్ ఖాన్. తన తండ్రి మరణంతో వీరి కుటుంబాన్ని వెలివేస్తారు. ఖురేషియన్స్, దేవ్స్ కుటుంబాలను నాశనం చేసే వరకు జుట్టు పెంచుకోనని సర్దార్ ఖాన్ శబదం చేస్తాడు. సర్దార్ ఖాన్ పాత్రలో నటుడు మనోజ్ బజ్ పెయ్ నటిస్తాడు. ఆ పోరులో కొంతకాలం పోరాడి వాసపూర్ పై ఆధిపత్యం సాధిస్తాడు.
ఫైజల్ ఖాన్ తండ్రి తాతల కంటే అతికిరాతమైన వాడు. ఖురేషియన్స్ కుటుంబాన్ని దేవ్ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసి కోల్, ఇంటర్నెట్ బిజినెస్ లో కూడా తనే కంట్రోల్ చేసే స్థాయికి వెళ్తాడు. ఆ తర్వాత తన అన్నని డెఫినెట్ చంపేస్తాడు. డెఫినెట్ నుంచి తమని తాము కాపాడుకోవడం కోసం పైజల్ కుటుంబం వాసిపూర్ నుంచి వెళ్లిపోతారు. దాంతో కథ ముగుస్తుంది.

మొత్తం ఈ సినిమా రెండు పార్ట్లలో కూడా ఫైజల్ ఖాన్ పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమాలో వైలెన్స్, సెక్స్ లో డైరెక్టర్ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమా లో బీహా ర్ నేటివిటీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది దాంతో ఈ సినిమాకి విపరీతమైన కేజ్ వచ్చింది. తెగించిలోడే ఇక్కడ బ్రతకగలడని తీరిని పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దాడు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. పురాణాలలో క్యారెక్టర్స్ కి దీటుగా పవర్ అండ్ రివెంజ్ కోసం మనిషి యొక్క రాక్షస రూపం వికృత నృత్యమే గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్..
క్రిటిక్స్ నుంచి కూడా థ్రిల్లింగ్ సబ్జెక్టే మన గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్. ఈ సినిమా కొందరి జీవితాలను ఓవర్ నైట్ లో మార్చేసింది ముఖ్యంగా ఈ సినిమా రైటర్ ఖాద్రీ.. తను రాసుకున్న నవలన్ని అనురాగ్ కశ్యప్ కి నచ్చి ఈ సినిమా తీశారు.

సాధారణ దర్శకుడు అయినా అనురాగ్ కశ్యప్ నేషనల్ రేంజ్ సంపాదించి పెట్టింది ఈ సినిమా.. ఈ సినిమాలో ఫాహిం ఖాన్, ఫైజల్ ఖాన్ నటించిన ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
రాంగోపాల్ వర్మ బెస్ట్ మెటా యాక్టర్స్ లో కచ్చితంగా ఉండాల్సిన పేరు మనోజ్ బాజ్ పేయ్ .. గత పాతిక సంవత్సరాలుగా ఎన్నో క్యారెక్టర్స్ లో అద్భుతంగా కనిపించారు . ఎన్నో సినిమాలలో ఆయన నటనతో అందర్నీ అలరించారు. గొప్ప గొప్ప నటులకి ఈయన రోల్ మోడల్ గా నిలిచారు పాత్ర ఏదైనా సరే తనదైన శైలిలో నటించి ఆ పాత్రకు జీవం పోస్తారు మనోజ్ బాజ్ పేయ్.. గ్యాంగ్స్ ఆఫ్ వాస్పూర్
అనురాగ్ కస్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మనోజ్ ను మళ్లీ ఫామ్ లోకి తీసుకువచ్చింది. సర్దార్ ఖాన్ రిలీజ్ అయిన 10 సంవత్సరాలు తర్వాత కూడా మాట్లాడుకుంటున్నారంటే అందుకు మనోజ్ వాజ్పేయి నటనే కారణం రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కిక్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ సినిమా ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది.