NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Video Viral:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద అధికార, విపక్ష పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో సిబ్బంది పోలింగ్ నిలిపివేసి భయంతో బయటకు పరుగులు తీశారు.

అనంతపురం జిల్లా తాడేపత్రి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి దిగారు. గన్నవరం నియోజకవర్గంలో వంశీ, యార్లగడ్డ వర్గీయులు చెప్పులతో దాడి చేసుకున్నారు. ఇక గుంటూరు జిల్లా తెనాలిలో ఓటేసేందుకు క్యూలైన్ లో రావాలని చెప్పినందుకు ..ఓ ఓటరుపై వైసీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని చెంప చెళ్లుమనిపించారు.

ఎమ్మెల్యే శివకుమార్ తన అనుచరులతో కలిసి పోలింగ్ బూత్ లోకి నేరుగా వెళుతుండగా, క్యూలైన్ లో ఉన్న ఓ ఓటరు అభ్యంతరం తెలిపాడు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ ఆ ఓటరుపై చేయి చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఖంగుతిన్న సదరు ఓటరు ఓటరు ఘటన నుండి వెంటనే తేరుకుని తిరిగి అదే స్పీడ్ తో ఎమ్మెల్యే శివకుమార్ చెంపపై ఒక్కటిచ్చాడు.

ఇది చూసిన అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటరుపై ముకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరో పక్క జరిగిన ఘటనపై ఎమ్మెల్యే అనుచరులు వివరణ ఇచ్చారు. సదరు ఓటరు క్యూలైన్ లో ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తుండగా, వాగ్వివాదం జరిగిందని, ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని చెబుతున్నారు.

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N