NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS : గండంగా గా మారిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు! గులాబీ పార్టీలో గుబులు!!

TRS : తెలంగాణ రాష్ట్ర సమితి ఎదుర్కొంటున్న మరో అగ్ని పరీక్ష నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. సిట్టింగ్ ఎమ్మెల్సీ సిద్ధంగా ఉన్నా చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకుండా టీఆర్ఎస్ అధినేత మీనమేషాలు లెక్కించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థబలంతోనే గెలవమనే అభిప్రాయంతో చివరికి మళ్లీ సిట్టింగే టికెట్ ఇచ్చారు. అయితే ఆ గెలుపు నల్లేరుపై నడకలా లేదు. ఆ ఎన్నిక అధికార పార్టీ తేలిగ్గా పరిస్థితి లేదు.

Tension in Trs
Tension in Trs

TRS : కెసిఆర్ కి దగ్గర ….జనానికి దూరం!

సిట్టింగ్ ఎమ్మెల్సీ అర్థికంగా బలవంతుడే అయినా ఆయన గడిచిన పదవీకాలంలో ప్రజలకు చేసిందేమీ లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. పైగా ఆయన కేసీఆర్‌కు దగ్గరే కానీ ప్రజలకు ఏనాడూ దగ్గరగాలేరనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి కూడా పల్లా రాజేశ్వర్‌ రెడ్డి విద్యా, వ్యాపారవేత్తగా సుపరిచితుడే అయినా ప్రజలకు గానీ, కార్యకర్తలకు గానీ ఆయన చేసింది శూన్యం. అయితే కేసీఆర్‌కు అత్యంత విశ్వసనీయుడిగా ఉంటూ అధినేత అప్పజెప్పే పార్టీ పనులను సమర్థవంతంగా చక్కబెట్టే నేతగా పేరు తెచ్చుకున్నారు రాజేశ్వర్‌ రెడ్డి. అయితే ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన బాధ్యత లేని ప్రజా ప్రతినిధిగా వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రత్యర్థుల చేతిలో అదే ప్రధాన అస్త్రం.

బహుముఖ పోటీతో పల్లా బయటపడొచ్చు!

ఇంత వ్యతిరేకతలోనూ రాజేశ్వర్‌ రెడ్డి‌కి కలిసి వచ్చే కీలకమైన అంశం ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం. ఇక్కడ బరిలో విపక్షాలతో పాటు ప్రొఫెసర్ కోదండరాం, రాణీరుద్రమ, తీన్మార్ మల్లన్న వంటి సుపరిచితులు పోటీ పడుతున్నారు. దీంతో టీఆర్ఎస్‌ను ఓడించాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికలు, పేలికలై పోతోంది. దీంతో సొంత ఓటు బ్యాంకును కాపాడుకోగలిగితే చాలు తన గెలుపు సులభం అని టీఆర్ఎస్ భావిస్తోంది.దుబ్బాక లో ఓటమి, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో అంతంత మాత్రం విజయం తో బాగా డల్ గా ఉన్న టీఆర్ఎస్ గ్రాఫ్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా పైకి పెరగకపోతే ఆ పార్టీకి ప్రమాద ఘంటికలు మోగినట్టే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.కాబట్టి టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్క అవకాశాన్ని వెతుక్కుంటూ చాపకింద నీరులా రాజకీయం సాగిస్తోంది!

author avatar
Yandamuri

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju